అనుష్క లైఫ్ టర్న్ చేసింది ఆ సినిమాయేనా..?
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన `సూపర్` సినిమా ద్వారా అనుష్క తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ దశాబ్దన్నర కాలంలో అనుష్క ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగారు. అనేక మరపురాని పాత్రలు చేశారు. ఈ క్రమంలోనే అనుష్క సౌత్ లో టాప్ లీగ్ హీరోయిన్ గా పది సంవత్సరాలకు పైగానే కొనసాగింది. తెలుగు, తమిళ భాషల్లో ఇంచుమించు అందరు స్టార్ హీరోస్ పక్కన నటించింది.
అయితే హీరోయిన్గా అనుష్క శెట్టికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా, మరియు అనుష్క లైఫ్ టర్న్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే.. ‘అరుంధతి’ సినిమాకే అగ్రస్థానం ఉంటుంది. కోడి రామకృష్ణ దర్శత్వంలో చివరగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం అరుంధతి. అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో అప్పటివరకు గ్లామర్ హీరోయిన్ గా ఉన్న అనుష్క ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది.
13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. జేజమ్మ పాత్రలో కనిపించిన అనుష్క, ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ను అందుకుంది. అప్పటి వరకు గ్లామర్ బ్యూటీగా మాత్రమే పేరున్న అనుష్కకు అరుంధతి సినిమా సోలోగా లేడి ఓరియంటెడ్ సినిమాల మార్కెట్‌ను క్రియేట్ చేసింది.