వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా తన స్టైల్స్, సోషల్
మీడియా పోస్ట్ లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే
బ్యూటీ మలైకా అరోరా. జిమ్ డ్రెస్ అయినా
పార్టీ వేర్ అయినా తనదైన స్టైల్ చూపించటంలో ఈ
భామ ఏ మాత్రం వెనుకాడదు. సల్మాన్ ఖాన్ సోదరుడితో వైవాహిక బంధం తెగదెంపులు చేసుకున్న తరువాత యంగ్
హీరో అర్జున కపూర్‌తో ఈ
భామ డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మలైక మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. వయసు పెరుగుతున్న కొద్ది మరింత హాట్‌గా తయారవుతున్న
మలైకా డ్రెసింగ్ స్టైల్ ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.
తాజాగా ఈ
భామ జిమ్ లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బాడీ కలర్లో ఉండే టాప్, టైట్స్ లో మలైక వావ్ అనిపించేలా ఉంది. జిమ్ వేర్‌లోనూ తన అందాలను ఆరబోస్తూ మలైక ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్ బాడీ కలర్లోనే ఉండటంతో అసలు ఒంటిమీద డ్రెస్ ఉందా లేదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు నెటిజెన్లు.
అయితే ఈ ఫోటోలను షేర్ చేస్తున్న అభిమానులు ఈ వయసులోనే మలైక అందాలు, ఒంపులు అద్భుతంగా అంటూ పొగిడేస్తుంటే. మరికొందరు మాత్రం ఈ ఏజ్‌లో ఇలాంటి డ్రెస్‌లు అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న ఈ
భామ సోనీ టీవీలో ప్రసారం అవుతున్న
టీవీ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్‌కు జెబ్జ్గా వ్యవహరిస్తోంది.