మారుతిని టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ !

Seetha Sailaja
టాలీవుడ్ బూతు సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన మారుతికి కాలం కలిసి రానట్లే కనిపిస్తోంది. యూత్ లో తనకు ఉన్న ఇమేజ్ ని కాసులుగా మార్చుకుందామని ఈమధ్య నిర్మాతగా మారి కొంతమంది యువ దర్శకుల చేత తీయించిన సినిమాలు ఘోరంగా విఫలం కావడంతో మారుతి హవాకు టాలీవుడ్ లో బ్రేక్ పడినట్లే అనిపిస్తోంది. దీనికి తోడు లేటెస్ట్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ తో మారుతి గొడవ పడినట్లు తెలుస్తోంది.  గీతాఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేస్తున్న మారుతి ఈ నిర్మాతతో గొడవకు దిగడటమేంటని టాలీవుడ్ లో చాలామంది ఆశ్చర్య పోతున్నారు. అయితే వివరాలు ఈ విధంగా భయటకు వస్తున్నాయి. అల్లుశిరీష్ హీరోగా ‘కొత్తజంట’ మూవీ తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మారుతియే దర్శకుడు. మొదట్లో ఫిబ్రవరి 14న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇప్పుడేమో మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.  ఇలా వెనక్కి వెళ్లడానికి కారణాలు చాలానే వున్నాయి అని అంటున్నారు. ఇక మారుతి సినిమాల గురించి అందరికీ తెల్సిందే! డబుల్ మీనింగ్ డైలాగులు చాలా ఎక్కువగా వుంటాయి. ఇటీవల మారుతి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ’లవ్ యు బంగారమ్’పై అన్నివర్గాల నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. దీంతో ‘కొత్తజంట’ని చూసిన నిర్మాత అల్లుఅరవింద్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఫిల్మ్‌నగర్‌‌లో చెప్పుకుంటున్నారు. కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని డిమాండ్ చేశాడట. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కాస్త గొడవకు దారితీసినట్లు టాక్.  డబుల్ మీనింగ్ డైలాగులు తొలగించాలని అల్లుఅరవింద్ సీరియస్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం డబల్ మీనింగ్ డైలాగ్స్ తోనే సినిమా నడిపించేయాలి అన్న మారుతి ఆలోచన మారకపోతే టాలీవుడ్ లో మారుతికి రోజులు దగ్గర పడినట్లే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: