డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న బోల్డ్ బ్యూటీ!

JSR
ప్రస్తుతం సినిమాలకు ధీటుగా డిజిటల్‌ రంగం కూడా ఎదుగుతోంది. అన్ని భాషల్లో వెబ్‌ సిరీస్‌లు భారీగా తెరకెక్కుతున్నాయి. అమేజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌, జీ5, ఆహా లాంటి డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లు ప్రసారం అవుతున్నాయి. అందుకే టాప్‌ స్టార్లు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఓ అందాల భామ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అలరించే అందాల భామ ఈషా గుప్తా. ఇటీవల రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన ఈ భామ త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో అభిమానులను పలకరించనుంది. ఇటీవల ఘనవిజయం సాధించిన రిజెక్ట్‌ ఎక్స్‌ వెబ్‌ సిరీస్‌ రెండో భాగంలో ఈషాగుప్తా కీ రోల్‌లో నటించనుంది.

ఈ వెబ్‌ సిరీస్‌లో ఈషా పోలీస్‌ అధికారి పాత్రలో నటించనుందని తెలుస్తోంది. దర్శక నిర్మాత గోల్డీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ త్వరలో చిత్రకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ `నేను గతంలోనూ పోలీస్‌ పాత్రలో నటించాను. కానీ ఈ పాత్రలో కొత్తగా కనిపించనున్నాను. ఆ వెబ్‌ సిరీస్‌లో అవినీతి పరురాలైన పోలీస్‌గా నేను నటిస్తున్నాను` అంటూ చెప్పింది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
It rained on my parade(literally ☔️)

A post shared by Esha Gupta🌎 (@egupta) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: