మన భారతీయ సంస్కృతి విధానాలను పాటిద్దాం.. కరోనాని తరిమేద్దాం అంటున్న సెలబ్రెటీలు!
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో మొదలైన ఈ భయంకరమైన వైరస్ ఇప్పటివరకూ మొత్తం 64 దేశాలకు విస్తరించిందని, ఈ దేశాల్లో 8,774 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తన నివేదికలో తెలిపింది. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితని అభిప్రాయపడింది. ఈ దేశాల్లోని 60 ఏళ్ల పైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సులువుగా సోకుతుందని, వారు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇండియాలో కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా పలు సూచనలు చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు కరోనా రాకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. ఎవరినైన పలకరించడానికి షేక్ హ్యాండ్స్‌కి బదులు నమస్తే పెట్టండి. కరోనాను అరికట్టడం మన చేతుల్లోనే ఉంది. ఈ వైరస్ కి ఇంకా మెడిసన్ కనుగొనలేదు.. కాకపోతే మనం సుచీ శుభ్రంగా ఉండటం వల్ల ఈ వ్యాది కాస్తైనా నివారించవొచ్చు అంటున్నారు. పాత ఆచారం వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. రానున్న రోజులలో ఎంతమంది పాత ఆచారాన్ని పాటించి కరోనాకి దూరంగా ఉంటారో చూడాలి అని అనుపమ్ ఖేర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Of late I am being told by lots of people to keep washing hands to prevent any kind of infection. I do that in any case. But also want to suggest the age old indian way of greeting people called #Namaste. It is hygienic, friendly & centres your energies. Try it. 🙏🙏 #caronavirus pic.twitter.com/ix7e6S8Abp — anupam kher (@AnupamPKher) March 3, 2020
యాంకర్ సుమ వినూత్న ప్రచారం :
కరోనా వైరస్ భయం తెలుగు ప్రజలకు పట్టుకున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు యాంకర్ సుమ ఓ వీడియో విడుదల చేసింది. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం జీర్ణకోశ సమస్యలు ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ ఉన్నట్లు కాదు. కాకపోతే వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి.
మన భారతీయ సంస్కృతి విధానంలో ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాం' అని తెలిపింది. వంటలో పసుపు, బాగా ఉడకబెట్టిన పదార్థాలే తింటాం. వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. శుభ్రతే వైరస్‌కు చక్కటి మందు. ఓకే.. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి.. హ్యాపీ డే..' అంటూ అభిమానులకు ధైర్యం చెప్పింది.
auto 12px; width: 50px;">View this post on InstagramA post shared by suma Kanakala (@kanakalasuma) on