నటన అంటే ఆసక్తి.. కష్టాలను అధిగమించి... ఆఫీస్ బాయ్ నుంచి ఆర్టిస్ట్ వరకు..?
చాలామందికి నటనలో తమ ప్రతిభను కనబరచాలని ఎంతో పేరు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యల కారణంగా తమ ఇష్టాన్ని చంపుకొని కుటుంబ పోషణ కోసం వేరే చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా ధ్రుడ సంకల్పంతో ముందుకు సాగుతూ అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి తెచ్చాడు. నాటకాలపై చిన్ననాటి నుంచే ఎక్కువ ఇష్టం ఉండడంతో పాటు డాన్స్ పాటలు డైలాగులు చెప్పడంలో ప్రతిభ కనబరుస్తూ ఉండేవాడు నాని. ఎలాగైనా సినిమా రంగం లోకి వెళ్లి ప్రతిభ కనబర్చాలి అనుకున్నాడు. కష్టాలు అన్నింటినీ అధిగమించి ప్రస్తుతం సీరియల్లు సినిమాలల్లో నటిస్తు శభాష్ అనిపించుకున్నాడు.
ఉట్కూరు మండలానికి చెందిన నాని... తండ్రి మరణించడంతో చదువు మధ్యలో వదిలేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే ఒక కాఫీ షాప్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే సంజీవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది నానికి. దీంతో తనకు నటన అంటే ఇష్టం అంటూ ఏదైనా అవకాశం ఇప్పించాలంటూ కోరాడు. ఈ క్రమంలో ఓ వైపు కుటుంబ పోషణ చూసుకునేందుకు కాఫీ షాప్ లో పని చేస్తూనే మరోవైపు తనకు బాగా ఇష్టమైన నాటకాలు డైలాగ్స్ డాన్స్ లలో మరింత నైపుణ్యత పొందాడు. ఇక ఆ తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పరిచయం కావడంతో.. పలు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడమే కాదు సీరియల్లో కూడా నటిస్తున్నాడు నాని. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ నిరూపిస్తున్నాడు. అయితే తమ మండలానికి చెందిన యువకుడు అన్ని కష్టాలను అధిగమించి ప్రస్తుతం టీవీ సీరియల్లో మంచి పొజిషన్లో ఉండటంపై మండల వాసులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛానల్ లలో ప్రసారమయ్యే... ఎన్నో సీరియల్ లో నటిస్తున్నాడు నాని. ఇక నాని డెడికేషన్ కు పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు.ఒక చాయి వాలా నటుడిగా ఎదిగిన తన డెడికేషన్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.