మెగా ఫ్యామిలీలో కొత్త చిచ్చు... ఆ హీరోనే గొడవకు కారణమా...?
దీనిపై అటు మహేష్, కొణిదెల టీం ఎవ్వరూ స్పందిచ లేదు. అయితే ఇంతలోనే మరో టాక్ కూడా బయటకు వచ్చింది. ఇదే పాత్ర కోసం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలని బన్నీ ఎంతో ఉత్సాహంతో ఉన్నాడట. వాస్తవంగా చూస్తే వీలున్నప్పుడల్లా మెగాస్టార్‌ను బన్నీ గతంలో ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేవాడు. కొద్దిరోజులుగా వాయిస్ కూడా మారుతూ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ పై రెండు మూడు సార్లు కవ్వింపు ధోరనితో మాట్లాడిన బన్నీ పవన్ ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యాడు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలకు సైతం బన్నీ టార్గెట్ అయ్యాడు. దీనికితోడు టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో బన్నీ వర్సెస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య స్టార్ హీరో రేస్ కోసం వార్ నడుస్తోంది.
అల్లు అరవింద్ తన కుమారుడు బన్నీ కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ... రామ్ చరణ్ విషయాలు పట్టించుకోకపోవడంతో మెగాస్టార్ కాస్త ఆవేదనకు గురైనట్లు కూడా వార్తలు గతంలో వినిపించాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెగా ఫ్యామిలీ తో సంబంధం లేని మహేష్ బాబును కీలకంగా తీసుకోవడంతో మళ్ళీ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య సరికొత్త వార్‌కు తెరలేచిందన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహేష్ మ్యాటర్ మెగా ఫ్యామిలీలో పరోక్షంగా వార్‌కు కారణమైంది. మరి ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి.