షాకింగ్ అనుష్క పెళ్ళి పై మరో కొత్త రూమర్ !

Seetha Sailaja

ఈ మధ్య అనుష్క ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను తన తల్లి తండ్రులు చెప్పిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటాను అంటూ ఓపెన్ గా చెప్పింది. అయినా ఆమె పై వార్తలు వ్రాసే విషయంలో మీడియా సంస్థలు ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. 


కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ నిర్మాతతో అనుష్క పెళ్ళి జరగబోతోంది అని వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇప్పుడు ఆమె పేరును ఒక ప్రముఖ దర్శకుడు కొడుకుతో లింక్ చేస్తూ ఇప్పుడు బాలీవుడ్ మీడియా సరికొత్త రూమర్స్ సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు కుమారుడు అయిన ఈ వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది.


అయితే కొంతకాలం తరువాత వీరిద్దరూ విడిపోయారు. ఇలాంటి పరిస్థితులలో అనుష్క పేరును ఆ టాలీవుడ్ దర్శకుడు కొడుకు పేరుతో లింక్ చేస్తూ ఎందుకు వార్తలు వ్రాస్తున్నారు అన్న విషయం ఎవరికీ అర్ధం అవ్వడం లేదు. ఈ విషయమై మరొకసారి అనుష్క నుండి క్లారిటీ వచ్చే వరకు ఈ వార్తలు ఇలాగే కొనసాగుతాయి. ఇది ఇలా ఉంటే అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు దర్శకులు అనేక ఆఫర్లు అనుష్క కు ఇస్తున్నా ఆమె పట్టించుకోకుండా బెంగుళూరులోనే ఉంటోంది. ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ ఏప్రియల్ 2న విడుదల కాబోతోంది. 


అయితే ఈ సినిమా సంబంధించిన ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తరువాత ఈ మూవీ నిర్మాత కోన వెంకట్ కొన్ని మార్పులు చేయాలని భావించి కొన్ని సీన్స్ రీ షూట్ కోసం అనుష్క ను సంప్రదించినా ఆమె స్పందించడం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ఆమె పెళ్ళి విషయమై ఎదో జరుగుతోంది అన్న సందేహాలు పెరిగిపోయి ఇలా గాసిప్పుల రూపంలో వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ‘భాగమతి’ విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోతున్నా ఆమె నుంచి సినిమా లేకపోవడంతో ఆమె అభిమానులు చాల బెంగ పెట్టుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: