హిట్ కోసం పాట్లు...

  దర్శకుడు గుణశేఖర్ వరుస ప్లాప్ లు ఎదుర్కోంటున్నా, ఇప్పడు మరో కొత్త చిత్రానికి శ్రీకారం చూట్టారు. మహేష్ బాబుతో ఆర్జున్, బన్నీతో వరుడు, రవి తేజ నిప్ప సినిమాలు ప్లాప్ తో మునిగి పోయిన గుణ, ఈ సారి చారిత్రత్మక కథతో నారీ మణీ పౌరుష, పరాక్రమాలే కధా వస్తువుగా చిత్రాన్ని తెర కెక్కించడానికి సన్నాహలు చేస్తున్నారు గుణ శేఖర్.  గతంలో చిరంజీవితో చూడాలని ఉంది, మహేష్ తో ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్ తో బాల రామాయణం, చిత్రాలకు గుణశేఖర్ ఇచ్చినా హిట్స్ కన్నా ప్లాప్ ల శాతం ఎక్కువే. ఇప్పడు తమన్నా ప్రధాన పాత్రలో రుద్రమదేవి టైటిల్ తో సినిమాను తన దర్శకత్వంలో ప్రతిష్టిత్మకంగా రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు.  కాకతీయుల వీర పరాక్రమాలు , అనాటి స్థితి గతులను, ఆచార్య వ్యవహరాలు రుద్రమదేవి చిత్రంలో ఉంటాయి. బారీ బడ్జెట్ తో బారీ సెట్టింగ్ లతో అందమైన దృశ్య కావ్యంగా మలచడానికి గుణశేఖర్ కృషి చేస్తున్నారు. జూలై లో ఈ చిత్రాన్ని సెట్ మీదకు దర్శక,నిర్మాతలు తీసుకు వస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: