అప్పట్లో స్టార్ హీరోయిన్లు.. రీ ఎంట్రీలో మాత్రం ఫెయిల్!
రీ ఎంట్రీ కోసం చాలా ప్రయత్నించినా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో కృష్ణ భగవాన్ లాంటి కమెడియన్ సరసన కూడా నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ కావటంతో సిమ్రాన్ కెరీర్‌కు తెరపడింది. తరువాత అడపాదడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నా ఒకప్పటి స్టార్ ఇమేజ్ మాత్రం ఇప్పుడు లేదు. ఒక్క సినిమా మాత్రమే కాదు మరో అందాల భామ రాశీ పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోస్‌కు బెస్ట్ జోడి అనిపించుకున్న రాశీ తరువాత ఐటమ్ సాంగ్స్‌కు మారింది. ఆ తరువాత గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన మునుపటి వైభవం మాత్రం రాలేదు. మరో స్టార్ హీరోయిన్ మీనా కూడా రీ ఎంట్రీలో ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడి కట్టిన ఈ భామ తరువాత సీనియర్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించిన వరుస అవకాశాలు అందుకునే స్థాయిలో ప్రూవ్ చేసుకోలేకపోయింది. వీళ్లే కాదు అమల, ఆమని, గౌతమి లాంటి చాలా మంది సీనియర్ హీరోయిన్లది అదే పరిస్థితి.