
రాజీవ్ కనకాల సంపాదన పై సుమ సెటైర్లు !
టాప్ యాంకర్ గా బుల్లితెర ను శాసిస్తున్న సుమ కు ఒక టాప్ హీరోయిన్ కు ఉండే రేంజ్ లో ఆస్థులు ఉన్నాయి అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనికితోడు సినిమా ఫంక్షన్స్ కు ఆమె యాంకరింగ్ అదనపు ఆకర్షణ కావడంతో ఆమెకు లక్షల రూపాయలలో పారితోషికం ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో సుమ తన భర్త రాజీవ్ కనకాల సంపాదన పై ఒక టివి షోలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ కార్యక్రమానికి న్యూస్ ప్రేజంటర్ జాఫర్ కూడా వచ్చాడు. అక్కడ జాఫర్ సుమతో మాట్లాడుతూ ఆమెకు ఒక స్ట్రెయిట్ ప్రశ్నను అడిగి షాక్ ఇచ్చాడు.
‘మీ భర్త రాజీవ్ కనకాల ఎంత సంపాదిస్తున్నారు.. ఆయన సంపాదన కంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారంట కదా’ అంటూ జాఫర్ అడిగిన ప్రశ్నకు ఒక్క క్షణం పాటు సుమ షాక్ అయింది. ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీ పై అనవసరపు కామెంట్స్ వస్తాయి. ఆడవాళ్ళ సంపాదన మీకెందుకురా అంటూ కొందరు ట్రోల్ చేసే ఆస్కారం ఉంది అంటూ సుమ సున్నితంగా జాఫర్ ను హెచ్చరించింది.
దీనితో సుమ సమయస్పూర్తికి ఆ షోకు వచ్చిన వారు ప్రశంసిస్తూనే సుమ మాత్రం పరోక్షంగా తన సంపాదన రాజీవ్ కన్నా ఎక్కువ అన్న విషయం పరోక్షంగా అంగీకరించింది. వాస్తవానికి రాజీవ్ కనకాల కన్నా సుమ సంపాదన ఎక్కువ అన్న విషయాన్ని ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ ఓపెన్ గానే అంగీకరిస్తూ తాను ఇప్పటి వరకు సుమ సంపాదన గురించి అడగలేదని ఆ స్పేస్ ఆమెకే వదిలేస్తానంటున్నాను అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు రోజుకు 8 గంటలకు పైగా లైట్స్ మధ్య నుంచుని ఒక కార్యక్రమం హోస్ట్ చేయడం అంత సులువైన పని కాదని దీనికోసం ఆమెకు ఎంత పారితోషికం ఇచ్చినా సరిపోదు అంటూ కామెంట్ చేసాడు..