పవన్ సినిమాకు క్రేజ్ ఫుల్... బిజినెస్ డల్...!
హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అంటే మాత్రం ఆసక్తి చూపించడం లేదు బయ్యర్లు అని తెలుస్తోంది. దీనికి కారణం ఆ సినిమా బాలీవుడ్ సినిమా రీమేక్ కావడం, అలాగే తమిళంలో కూడా ఇప్పటికే వచ్చేయడం. ఈ రెండు సినిమాల వెర్షన్లు ఇప్పటికే చాలా మంది చూసేసారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో తీసినా అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను చూసేందుకు ఎవ్వరూ ఇష్టపడరు.
మరి అలాంటి సినిమాకు హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ ఎవ్వరు మాత్రం కొంటారు. అసలు హిందీ డబ్బింగ్‌కు ఎంక్వైరీలే రావడం లేదట. ఇక ఏపీ, తెలంగాణ లో కూడా ఈ సినిమాను భారీ రేట్లకు కొనేందుకు బయ్యర్లు అంత ఆసక్తి చూపడం లేదట. చాలా ఏరియాల్లో నిర్మాత దిల్ రాజు ఆశించిన రేట్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ రేట్లు మాత్రమే అడ్వాన్స్‌లు ఇస్తామని బయ్యర్లు అంటున్నారట.
అసలు పవన్ గత సినిమాలు సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు పవన్‌పై భారీ రేట్లు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నిర్మాత దిల్ రాజు పలుకుబడి, ఆయన సినిమాలు అన్నీ కలిపి రేటు లాగాలేమో కానీ, బయ్యర్ల సైడ్ మాత్రం పెద్దగా రేటు పలకడం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాల భోగట్టా..!