అనీల్ రావిపూడి కి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న హీరోల మౌనం !

Seetha Sailaja

సాధారణంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ మూవీ దర్శకుడు ఫోన్ కు ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు నిర్మాతలు వరసపెట్టి ఫోన్ చేస్తూ అభినందనలు తెలియచేయడం సాధారణమైన విషయం. ఈ సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఇండస్ట్రీ టాప్ హిట్ కాకపోయినా ఖచ్చితంగా 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను వసూలు చేసింది అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. 

100 కోట్ల కలక్షన్స్ ను రాబట్టిన దర్శకుడుకు చాలామంది హీరోలు ఫోన్ చేయడంతో పాటు అతడి దగ్గర ఏమైనా మంచి కథలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. వాస్తవానికి ఒక టాప్ హీరోతో ఒక ఫెయిల్యూర్ సినిమాను తీసిన దర్శకుడుకి కూడ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ఫోన్ చేసి కష్టానికి తగ్గ ఫలితం రాలేదని అధైర్య పడవద్దు అంటూ ఆ దర్శకుడుకి ఫోన్స్ చేయడం పరిపాటి. 

అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై మూడు వారాలు దాటిపోతున్నా అనీల్ రావిపూడికి టాప్ హీరోలు అయిన ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ లాంటి టాప్ హీరోల నుండి కనీసపు ప్రశంసలు రాలేదు అని తెలుస్తోంది. అంతేకాదు మిడిల్ రేంజ్ హీరోలు అయిన విజయ్ దేవరకొండ నాని నితిన్ నాగచైతన్య లు కూడ అనీల్ రావిపూడికి కనీసం మర్యాదగా అయినా ఫోన్ కాల్ చేయలేదు అని వస్తున్న వార్తలు చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే ఏకంగా అనీల్ రావిపూడికి షాక్ ఇస్తున్నట్లు టాక్.

ఇటువంటి సమయంలో అనీల్ రావిపూడిని పలకరిస్తూ అతడిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు అన్న ప్రచారం జరుగుతోంది. వారిలో ఒకరు మహేష్ అయితే మరొకరు దిల్ రాజ్ అని తెలుస్తోంది. అనీల్ రావిపూడి మరొక మంచి కథను తీసుకువస్తే వచ్చే ఏడాది అతడితో మరొక సినిమాను చేయడానికి మహేష్ రెడీగా ఉంటే ‘ఎఫ్ 3’ వీలైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయమని దిల్ రాజ్ ప్రోత్సహిస్తున్నట్లు టాక్. దీనితో ‘ఎఫ్ 3’ మూవీలో మళ్ళీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరొక హీరోను కూడ కలుపుకుని తిరిగి తన మార్క్ ను నిలబెట్టుకోవాలని ఈ యంగ్ డైరెక్టర్ తపన..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: