ఆ చారిత్రాత్మక సినిమాలో.. పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్..?

praveen

పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సమయంలో అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి పూర్తిగా సినిమాలకు దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను సినిమాల్లోకి రానని  పలుమార్లు స్పష్టం చేశారు.కానీ  దర్శక నిర్మాతలు పట్టు విడవకుండా పవన్ కళ్యాణ్ ని ఒప్పించి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. బాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించిన పింక్  మూవీ ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ అమితాబచ్చన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

 

 

ఈ  సినిమా తర్వాత దర్శక నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ తో మరిన్ని సినిమాలు చేయించేలా మంతనాలు జరుపుతున్నది తెలిసిన విషయమే. అయితే పింక్ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టగా ఈ సినిమా షూటింగ్ కోసం 30 రోజులు డేట్స్ కేటాయించాడు పవన్ కళ్యాణ్. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 27 నుంచి హైదరాబాద్ ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ మొదలుపెట్టనున్నారట .

 

 

 కాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుంది అంటున్నారు. చారిత్రాత్మక కాలం నాటి ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన చిత్రంగా దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రూపొందుతున్నట్లు  సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మంచి కోసం పోరాడే దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు కనిపించనున్నాడట. కాగా ఈ సినిమా పై ఇప్పటి వరకు అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: