అల వైకుంఠపురములో : సామజవరగమన కుమ్మేసింది భయ్యా !

Reddy P Rajasekhar

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
 
థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదలకు ముందే ఛార్ట్ బస్టర్స్ కాగా దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలోని పాటలను అద్భుతంగా తెరకెక్కించాడు. విడుదలకు ముందే 133 మిలియన్ల వ్యూస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సామజవరగమన పాట సినిమాలో వచ్చే సందర్భం, పాటకు లిరిక్స్ అన్నీ చక్కగా కుదిరాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన పాటను అద్భుతంగా తెరకెక్కించాడు.
 
కొరియోగ్రఫీ కూడా చక్కగా కుదరటంతో తెలుగు ఇండస్ట్రీలో ఒక బెస్ట్ సాంగ్ గా సామజవరగమన పాట నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా కథ, కథాంశం రొటీన్ అయినప్పటికీ త్రివిక్రమ్ పెన్ పవర్, బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. థమన్ ఈ సినిమాతో తనను తాను కొత్తగా మరోసారి ఆవిష్కరించుకున్నాడు. తన పాటలతో, నేపథ్య సంగీతంతో సినిమా సక్సెస్ లో థమన్ తన వంతు పాత్ర పోషించాడు. 
 
బన్నీ నా పేరు సూర్య ఫ్లాప్ తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకొని నటించినప్పటికీ ఆ గ్యాప్ ను ఫిల్ చేసే సరికొత్త కథాంశంలో నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోసారి తన మాటలతో త్రివిక్రమ్ సినిమాను నిలబెట్టాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు సినిమాలో ఉండటంతో సంక్రాంతి పండుగకు అల వైకుంఠపురములో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: