అందరికీ ఫ్యాన్స్‌.. నాకు మాత్రం ఆర్మీ వుంది

Arshu
మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవంగా అనిపించింది.''ఒక మనిషి గ్యాప్‌ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు. సింపుల్‌ విషయాలే కావచ్చు కానీ గొప్ప విషయాలు తెలుసుకుంటాడు. ఇంక లైఫ్‌లో  గ్యాప్‌ తీసుకోకూడదనే గొప్ప విషయం తెలుసుకున్నాను. ఒకటిన్నర సంవత్సరం అల్లు అర్జున్‌ హీరోగా నటించిన 'సోను కే టిటు కి స్వీటీ' అనేది గీతాఆర్ట్స్‌లో రీమేక్‌ చేద్దామని అడిగారు. చాలామంది అది నా కోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్‌ చేస్తే బాగుంటుందా! అని నేను పర్సనల్‌గా  ఆలోచించా. ఆ టైంలో త్రివిక్రమ్‌గారు, నేను కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్‌ అనిపించింది. అందుకే 'సోను కే టిటు' జోలికి వెళ్లకుండా ఈ స్టోరీతోటే ముందుకెళ్లాం.

ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చెయ్యాలని ఎందుకనుకున్నారు?

ఇంతకుముందు 'జులాయి'లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ ఉంటే, 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో ఎమోషన్‌ ఎక్కువతో ఎంటర్‌టైన్‌మెంట్‌ తక్కువ అయ్యింది. దాంతో మళ్లీ
త్రివిక్రమ్‌తో సౌకర్యంగా ఉంటుందనా మూడు సినిమాలు చేశారు?

నా చివరి 10 సినిమాల్లో 3 త్రివిక్రమ్‌గారితోనే చేశాను. ఆయనేమో నేను 10 సినిమాలు చేస్తే, వాటిలో 3 మీతోనే చేశాను అని ఆయనంటున్నారు. కొన్నిసార్లు ఒక హీరోకి, ఒక డైరెక్టర్‌కి  ఒక రిథం సెట్టవుతుంది. పాత రోజుల్లో చిరంజీవిగారికీ, కోదండరామిరెడ్డిగారికీ బాగా సెట్టయింది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా కలిసి చాలా సినిమాలు చెయ్యగల కెమిస్ట్రీ త్రివిక్రమ్‌గారికీ, నాకూ మధ్య ఉంది. మేం ఒకళ్లనొకళ్లం బాగా అర్థం చేసుకుంటాం. ఆయనతో నాకంత సౌకర్యంగా ఉంటుంది కాబట్టే 3 సినిమాలు చెయ్యగలిగాను.

ఆయనతో మూడు సినిమాల వల్ల నటుడిగా మీకు ఉపయోగపడిందా?

కచ్చితంగా ఉపయోగపడిందని భావిస్తాను. ప్రతి డైరెక్టర్‌ ఒక నటుడి నుంచి కొత్తగా ఏదో ఒకటి వెలికి తీస్తారు. 'జులాయి'కి ముందు నేను 'బద్రినాథ్‌' చేశాను. అప్పటివరకు నేను చేసినవి ఒకెత్తు. 'జులాయి' నుంచి చూస్తే నా సినిమాలు మెచ్యూర్డ్గా, వేరే విధంగా ఉండటం కనిపిస్తుంది. యాక్టర్‌ నుంచి బెస్ట్‌ పర్ఫార్మెన్స్ను రాబట్టడంలో త్రివిక్రమ్‌ ఎక్స్పర్ట్‌. 'జులాయి'లో అది మీకు కనిపిస్తుంది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో మరింత బాగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోనూ పర్ఫార్మెన్స్‌ పరంగా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇందులో నేచురల్‌, రియల్‌ టైం పర్ఫార్మెన్స్‌ ఇవ్వడానికి ప్రయత్నించా. ప్రతి
'సామజవరగమన' సాంగ్‌ వెనుక ఉన్న కథేమిటి?

హైదరాబాద్‌లో కుర్రాళ్లు తెలుగు పాటలు బాగా ఇష్టపడుతున్న విషయం తెలిసింది. తెలుగు రాక్‌ బ్యాండ్స్‌ కూడా తయారయ్యాయి. ఆ విషయం త్రివిక్రమ్‌గారితో పంచుకున్నా. ఆ జోనర్లో ఒక పాట పెడితే క్లిక్‌ అవుతుందని చెప్పా. ఆ టెంపోతో తమన్‌ ఒక ట్యూన్‌ చేస్తే, దానికి త్రివిక్రమ్‌ 'సామజవరగమన' అనే ఒక పదం రాశారు. ఆ తర్వాత సీతారామశాస్త్రిగారు ఆ పాట రాశారు. అది చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత 20 రోజులు గ్యాప్‌ వచ్చింది.  ఆ తర్వాత దాన్ని లైవ్‌ పర్ఫార్మెన్స్‌ లాగా చిత్రీకరించి రిలీజ్‌ చేశాం. ఆ
మలయాళంలోనూ క్రేజ్‌ తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?

అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను దుబాయ్‌ తీసుకెళ్లి ఒక గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాలేతర వ్యక్తిని నేను. అలాగే కేరళలో బోట్‌ రేస్‌ ఫెస్టివల్‌ ఒకటి జరుగుతుంది. దానికి అక్కడి గవర్నర్తో పాటు నన్ను చీఫ్‌ గెస్ట్గా పిలిచారు. ఆ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడ్ని నేనే. అది నాకొక్కడికి లభించిన గౌరవం కాదనీ, మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవమనీ నాకు అనిపించింది.

మీ పిల్లల్ని సెట్‌కు  తీసుకెళ్తుంటారా?

అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. దానికో రీజన్‌ ఉంది. ఇదివరకు జనరేషన్‌ వాళ్లు పిల్లల్ని చిత్రీకరణటైంలో తీసుకెళ్తే పాడైపోతారనే ఫీలింగ్తో ఉండేవాళ్లు. పిల్లలకు సినిమాలు కూడా చూపించేవాళ్లు కాదు. రియాలిటీకి దూరంగా పెట్టేవాళ్లు. అది నాకు డబుల్‌ స్టాండర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది నేను చేసే పని. నన్ను ఈ స్థాయికి తెచ్చింది సినిమాయే.
{{RelevantDataTitle}}