బాలీవుడ్ హీరోయిన్ ని ముద్దాడిన అభిమాని..... వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో...!!

Mari Sithara

సినిమా నటులు అంటే చాలు మన ప్రేక్షకులు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరికొందరు అయితే హద్దులు దాటిపోయి వారికోసం ఏమి చేయడానికి అయినా సరే సిద్ధం అవుతుంటారు. నిజానికి మన ఇండియన్స్ మనస్థత్వం అంతేనని, ఒకవేళ వాళ్ళు ఎవరినైనా ఇష్టపడితే చాలు, వారికోసం ఏమి చేయడానికి అయినా వెనుకాడరని  పలువురు విదేశీ ప్రముఖులు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే నటులపై అభిమానం అనేది ఉండొచ్చు గాని, అది శృతిమించితే మాత్రం ఎక్కడైనా ఎవ్వరికైనా ప్రమాదం అనే చెప్పాలి. 

 

అందుకే మనకు ఇష్టం అయిన నటీనటులను మనం అనుకోకుండా కలిసినపుడు ఒక్కసారిగా మనకు ఆనందం అదుపులో ఉండదు అనే చెప్పాలి. అయితే అటువంటి సమయంలోనే మనమీద మనం నిగ్రహం కలిగి ఉండాలి. ఇక మనం చెప్పుకోబోతున్న విషయం దీనికి సంబంధించిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఇటీవల కేదార్నాథ్ అనే సినిమా ద్వారా నటిగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కొద్దిరోజుల క్రితం రణ్వీర్ సింగ్ సరసన సింబా అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి అందరినీ మెప్పించిన సారా, ఆ సినిమా ద్వారా తన అందం, అభినయంతో ఫ్యాన్స్ ని బాగానే సంపాదించింది. ఇక ఎప్పటికప్పడు తన శరీరాన్ని, 

 

అందాన్ని కాపాడుకునేందుకు పలు ఎక్సర్ సైజులు, యోగ వంటివి చేసే అలవాటున్న సారా, నేడు ఉదయం తన యోగ వర్కౌట్స్ ముగించుకుని ఇంటికికి బయల్దేరిన సమయంలో బయటకు రాగానే కొందరు పాత్రికేయ మిత్రులు ఆమెను ఫోటోలు కోరడంతో పలు రకాల ఫోజులిచ్చింది సారా. అయితే అదేసమయంలో అక్కడికి కొందరు ఫ్యాన్స్ కూడా రావడంతో వారితో సరదాగా సెల్ఫీలు దిగుతున్న సమయంలో హఠాత్తుగా ఒక అభిమాని ఆమె చేతిని లాక్కుని ముద్దుపెట్టుకొని  మరింత ముందుకు వస్తుండగా ఒక్కసారిగా సారా షాక్ అయింది, వెంటనే అలర్ట్ అయిన ఆమె పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది, అతడిని వెనక్కు నెట్టేశారు. ఇక ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు సారా ఫ్యాన్స్ దానిని చూసి షాక్ అవుతున్నారు....!!  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
This is no first time that fans have crossed their limits, a fan kisses @saraalikhan95 's hands as she comes out of her Pilate class #Saraalikhan #pilateslovers #pilates #instagood #instagram #bollywood #fans #paparazzi #varinderchawla

A post shared by Varinder Chawla (@varindertchawla) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: