వామ్మో, కనీసం కరెంటు ఖర్చులు కూడా రాబట్టలేని టాలీవుడ్ సినిమా అదేనా.....??

Mari Sithara

గత ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఘోర పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ కనీ వినీ ఎరుగని విధంగా అత్యంత దారుణమైన పేలవ ప్రదర్శన చేసిన సినిమాల్లో ఇటీవల రిలీజ్ అయిన ఒక సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. టాలీవుడ్ లో కొన్నేళ్లుగా పలు సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ మంచి పేరున్న నిర్మాతగా ఎదిగిన ఒక బడా నిర్మాత, ఇటీవల ఒక యువ హీరోతో ఆ సినిమాను నిర్మించడం జరిగింది. 

 

వాస్తవానికి అదే హీరోతో ఇటీవల ఆ నిర్మాత నిర్మించిన ఒక సినిమా ఫ్లాప్ కావడంతో, తదుపరి తీయబోయే ఈ సినిమా విషయమై కొంత జాగ్రత్త తీసుకోవడం జరిగిందట. ఇక ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడిని ఎంచుకున్న సదరు నిర్మాత, కథ అలానే కథనాల విషయమై ఈసారి మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్  కాలేదని, తప్పకుండా రిలీజ్ తరువాత మా బ్యానర్ నుండి ఆ హీరోకి మంచి హిట్ లభించడం ఖాయం అని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత చెప్పడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, తీరా రిలీజ్ తరువాత ఆ సినిమా పరిస్థితి ఊహించలేనంత ఘోరంగా తయారైందట. ఎంతలా అంటే, ఆ హీరోతో 

 

సదరు నిర్మాత గారు గతంలో తీసిన సినిమానే ఎంతో బెటర్ అనిపించేంతలా అట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కేవలం 790 డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసి, అక్కడ టాలీవుడ్ చరిత్రలో అత్యంత దారుణమైన పరాజయం పొందిన సినిమాగా నిలిచిందని, ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఆ కలెక్షన్ కూడా గ్రాస్ కలెక్షన్ అని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు తేల్చారట. కాగా ఈ సినిమాకు ఓవర్సీస్ లో కనీసం కరెంట్ ఖర్చులు అయినా వచ్చాయా, లేదా అంటూ పలువులు ప్రేక్షకులు సైతం సినిమాపై సోషల్ మీడియా మాధ్యమాల్లో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: