బోయపాటి బాలకృష్ణల మూవీకి పరిష్కారం లేని సమస్యలు !
గతవారం విడుదలైన ‘రూలర్’ బాలకృష్ణ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో పాటు ఈ ఏడాది టాప్ 10 ఫ్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ఈ ఏడాదికి సంబంధించిన ఈ టాప్ 10 ఫ్లాప్ సినిమాల లిస్టులో బాలకృష్ణ నటించిన ‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’ ‘రూలర్’ ఇలా మూడు సినిమాలు ఉండటంతో ఈ ఏడాది వరసగా మూడు ఫ్లాప్ లు అందుకున్న రికార్డ్ బాలకృష్ణ సొంతం అయింది.
దీనితో లేటెస్ట్ గా మొదలైన బాలకృష్ణ బోయపాటిల మూవీ ప్రాజెక్ట్ ఆగిపోతుందా అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి ముందుకు వచ్చినా ‘రూలర్’ కలక్షన్స్ పరిస్థితి చూసి ఈ మూవీకి 70 కోట్లు పెట్టుబడి పెట్టడానికి జంకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఈ నిర్మాత దర్శకుడు బోయపాటికి తన మనసులో మాట బయట పెట్టాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘రూలర్’ పరిస్థితి రీత్యా బాలయ్య సినిమా మార్కెట్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించి బోయపాటి అదేవిధంగా బాలయ్య తమ పారితోషికాల విషయంలో భారీ కోతను పెట్టుకుంటే తప్ప తాను మూవీని తీయలేనని అలా కుదరకపోతే ఈ మూవీకి మరొక సహ నిర్మాతను వెతికే పని చేయవలసిందిగా నిర్మాత రవీంద్ర రెడ్డి బోయపాటికి సూచన ఇచ్చినట్లు టాక్.
దీనితో ఈ అనుకోని పరిణామానికి బోయపాటి షాక్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రాజెక్ట్ కోసం అనేక కష్టాలు పడ్డ బోయపాటికి ఇప్పుడు ‘రూలర్’ ఫలితంతో అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా అతడి సినిమాకు ఒక నిర్మాత వెనకడుగు వేసాడు అని వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య రంగంలోకి దిగి ఈ సమస్యకు పరిష్కారం వెతికితే బాగుంటుందని బోయపాటి బాలయ్యకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది..