ఇలియానా లండన్ లో ఏం చేస్తుందో తెలుసా?

Murali

గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో ఎంతటి టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిందో తెలిసిన విషయమే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ హీరోయిన్ కోటి రూపాయల పారితోషికం తీసుకుందంటే అది ఇలియానా మాత్రమే. అంతటి భారీ క్రేజ్ ని టాలీవుడ్ లో పొందిన ఇలియానా తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గ్లామర్ పాత్రలు రాలేదు.. క్రేజ్ కూడా రాలేదు. మళ్లీ టాలీవుడ్ లో తన లక్ ట్రై చేసుకుంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

 


ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఈ పండుగ సెలెబ్రేషన్స్ ఇలియానా మొదలుపెట్టేసింది. ఇందుకు షాపింగ్ కూడా మొదలెట్టేసింది. షాపింగ్ కోసం ఇల్లూ బేబీ లండన్ చెక్కేసింది. బ్లాక్ రాంపర్ సూట్ లో ఇలియానా మెరిసిపోతోంది. లండన్ లోని ఆక్స్ ఫర్డ్  స్ట్రీట్ లో ఇలియానా షాపింగ్ చేస్తున్న.. చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. పండుగ షాపింగ్ అంతా ఇలియానా దగ్గరే ఉందా అన్నట్టు ఉంది.

 


టాలీవుడ్ లో ఆమెకి ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా ఆరేళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇచ్చినా రెండు కోట్ల పారితోషికం అందుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ ఇలియానా. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన ఫొటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయ్యాక ప్రస్తుతం తన బాడీ ఫిట్ నెస్ పై దృష్టి సారించింది. జిమ్ లో కసరత్తులు చేసి మళ్లీ తన మునుపటి ఫిట్ నెస్ సాధించేందుకు ట్రై చేస్తోంది. మరి మన మేకర్స్ ఇలియానాకు అవకాశం ఇస్తే మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం అనే చెప్పాలి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Evening gown ✅ Romper ✅ Stoles ✅ Finally, Mission Oxford Street successfully accomplished after a long day of shopping. Must say shopping feels like (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: