రాఘవ లారెన్స్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి అలా చేయను.. షాక్ లో ఫాన్స్.?

praveen

సినిమా ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించారు రాఘవ లారెన్స్. ఇక ఆ తర్వాత హీరోగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు రాఘవ లారెన్స్. అంతేకాదు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించే మంచి విజయాలను కూడా అందుకున్నారు. ఒకానొక సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ గా   కూడా తన సత్తా చాటాడు రాఘవ లారెన్స్ . ఇకపోతే రాఘవ లారెన్స్ ఇటీవలే వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలతో ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. 

 

 

 

 రాఘవ లారెన్స్ రజినీకాంత్ కి ఎంత వీరాభిమానో  అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా రజనీకాంత్ హీరోగా నటించిన ఆడియో వేడుకలో పాల్గొన్న రాఘవ లారెన్స్ తన అభిమాన హీరో రజనీకాంత్ పై తనకున్న ఆరాధ్యభావం  గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు  కమల్హాసన్ సినిమా పోస్టర్లపై పేడ  కొట్టేవాడనని  రాఘవ లారెన్స్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రజినీకాంత్ కమలహాసన్ స్నేహంగా ఉండడం చూసి ఫ్రెండ్షిప్ కంటే గొప్పది ఏది లేదు అని అర్థం చేసుకున్నానని రాఘవ లారెన్స్ ఆడియో లాంచ్ లో వ్యాఖ్యానించారు. ఇక  రాఘవ లారెన్స్ వ్యాఖ్యలపై కమలహాసన్ ఫాన్స్ మాత్రం తీవ్రంగా పరిగణించి... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమలహాసన్ పోస్టర్లపై పేడ  కొట్టేవాడిని అంటూ రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన ఫాన్స్ రాఘవ లారెన్స్ ను  సోషల్ మీడియాలో ట్రోల్స్  చేయడం ప్రారంభించారు. 

 

 

 

 అయితే ఈ ట్రోల్స్  కాస్తా రాఘవ లారెన్స్ వరకు వెళ్లడంతో వీటిపై రాఘవ లారెన్స్ స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను ఎలాంటి బయట కార్యక్రమాలకు హాజరు కావాలని అనుకోవట్లేదని .. అది రజినీకాంత్ కార్యక్రమం అయితే... ఆయన అనుమతి ఇస్తే వస్తాను తప్ప లేకుంటే రానంటూ ట్విట్టర్ వేదికగా రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయని... అవి ఇప్పుడు చెప్పలేను అంటూ ట్విట్ చేసాడు  రాఘవ లారెన్స్. తనకు రజిని  దీవెనలు కంటే ఇంకా ఏది ఎక్కువ కాదని తెలిపాడు. రాఘవ లారెన్స్ పెట్టిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రాఘవ లారెన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం దర్బార్  ఆడియో ఫంక్షన్ లో  రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై కమల్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే అని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: