చరణ్ ప్రవర్తనతో ఆర్ ఆర్ ఆర్ పై బలపడుతున్న పుకార్లు !

Seetha Sailaja

‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ఇంకా చాలసమయం ఉన్నా ఈసినిమాకు సంబంధించి టైటిల్ నుంచి చరణ్ జూనియర్ ల ఫస్ట్ లుక్ లు ఇంకా విడుదల కాకపోయినా ఈమూవీలో చరణ్ జూనియర్ ల పాత్రలు ఏ రేంజ్ లో ఉంటాయి అన్న ఊహలతో జూనియర్ చరణ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలోని వ్యక్తులు కూడ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ జూనియర్ లు కనిపించరు వారు నటించే పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అంటూ రాజమౌళి ఓపెన్ గా చెప్పినా చరణ్ జూనియర్ ల పాత్రల తీరు పై  పుకార్లు ఆగడం లేదు. 

ఇలాంటి పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించి చరణ్ పాత్ర చిన్నది అనీ జూనియర్ పాత్ర పెద్దది అంటూ కొందరు ఒక కొత్త గాసిప్పును ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇలాంటి గాసిప్పులు రావడానికి ఒక కారణం కూడ కనిపిస్తోంది. 

‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి రామ్ చరణ్ ఒకవైపు ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే బయట జరిగే అనేక ఫంక్షన్స్ కు అతిధిగా రావడంతో పాటు తరుచు తన భార్య ఉపాసనను తీసుకుని విదేశాలలో ఉండే హాలిడేస్ స్పాట్ కు వెళ్ళడం అక్కడ వారిద్దరు ఎంజాయ్ చేసిన ఆ హాలిడేస్ కు సంబంధించిన ఫోటోలను తన అభిమానులకు షేర్ చేయడం ఒక హాబీ గా కొనసాగించాడు. దీనికితోడు చరణ్ ‘సైరా’ నిర్మాణ కార్యక్రమాలంలో చాలచురుకుగా పాల్గొనడమే కాకుండా ఆ మూవీ ని ప్రమోట్ చేస్తూ చిరంజీవితో సమానంగా దేశంలోని అనేక నగరాలు తిరిగాడు.

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ సినిమాలో నటిస్తున్న చరణ్ కు ఇంత తీరిక ఎక్కడ దొరికింది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరచడమే కాకుండా జూనియర్ తో పోల్చుకుంటే చరణ్ డి చిన్న పాత్ర అని భావించేలా ఉంది అంటూ మరికొందరు మరో సరికొత్త గాసిప్పుకు తెర తీసారు. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి ఎక్కడా కనిపించక పోవడంతో పాటు కనీసం తారక్ తన భార్య పిల్లలతో పాటు విదేశాలకు వెళ్ళినట్లు వార్తలు రాకపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో చరణ్ కన్నా జూనియర్ బిజీగా ఉన్నాడు అన్న ఊహాగానాలకు తెర తీస్తూ జూనియర్ పాత్ర చరణ్ పాత్ర కన్నా పెద్దది అంటూ కొందరు సృష్టిస్తున్న ఈ గాసిప్పులు ప్రస్తుతం చాల అమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: