బాలయ్య రూలర్ ఫాన్స్ కు పండగేనా ?
ఆయన డైలాగ్ చెప్పే ఉరుములే... ఆయన ఫైట్ చేస్తే మెరుపులే...తొడ కొడితే రైళ్లు సైతం వెనక్కి పోవాల్సిందే...ఇక ఆయన సినిమాలంటే దబిడి దిబిడే... అసలు సిసలైన పవర్ఫుల్ హీరోయిజానికి మారుపేరు ఆయన... ఆయన ఇంకెవరో కాదు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ హీరోగా రూలర్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే బాలకృష్ణ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ సినిమా విజయం సాధించాలని బాలకృష్ణ ఆశలు పెట్టుకున్నాడు.అటు అభిమానులు కూడా బాలకృష్ణ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు . అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రూలర్ సినిమా.
రూలర్ సినిమాలో బాలకృష్ణ చాలా కొత్తగా కనిపిస్తారు.యంగ్ హీరోలకంటే యంగ్ గా కనిపించారు నందమూరి బాలకృష్ణ.. అయితే నందమూరి బాలకృష్ణ సినిమా కేవలం బాలయ్య అభిమానుల కోసమే తీసినట్లుగా ఉంది. రూలర్ సినిమాలో బాలయ్య అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అది పుష్కలంగా ఉంది. పవర్ ఫుల్ ఫైట్ లు ఇరగదీసే డాన్సులు... అదిరిపోయే పంచ్ డైలాగులతో బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూసి పండుగ చేసుకునేలా ఉంది. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కూడా రూలర్ సినిమాని బిసి ప్రేక్షకుల కోసమే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఐదు పదుల వయస్సులోనూ యువ హీరోలను సైతం తలదన్నే ఎనర్జీతో బాలయ్య డాన్స్ పర్ఫార్మెన్స్ లు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు.
బాలకృష్ణ గత రెండు సినిమాలైనా ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమా లో అభిమానులు మిస్సయిన యాక్షన్ పంచు డైలాగ్స్ అన్ని రూలర్ సినిమా లో పుష్కలంగా అభిమానులకు దొరికాయి. దీంతో అభిమానులు థియేటర్లో జై బాలయ్య జై జై బాలయ్య అంటూ అరుపులు మొదలుపెట్టారు. బాలయ్య పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చెప్పినప్పుడల్లా... థియేటర్ మొత్తం విజిల్స్ కేరింతలతో హోరెత్తి పోయాయి. అయితే మిగతా ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోతుంది బాలయ్య రూలర్ .కానీ మాస్ అభిమానులని మాత్రం ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది రూలర్ సినిమా. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.