ఆ ఒక్క ఫొటోతో త‌న ప్రేమ‌ బ‌య‌ట పెట్టిన కాజ‌ల్‌... పెళ్లికి లైన్ క్లీయ‌ర్‌

VUYYURU SUBHASH

మూడున్నర పదుల వయసు దాటినా ముదురు ముద్దుగుమ్మ‌గా ఉన్న కాజల్ అగర్వాల్ కు పెళ్లి కళ వచ్చేసింది. ప్రస్తుతం కాజల్ పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కోలీవుడ్‌, టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీకి గతంతో పోలిస్తే ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియ‌న్ 2 సినిమా ఒకటే ఉంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆమె సంసార‌ జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తోంది.

 

నిజానికి కాజల్‌అగర్వాల్‌కు చాలాకాలం నుంచే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని తనే ఆ మధ్య స్వయంగా చెప్పింది. కాజ‌ల్ చెల్లి నిషా అగ‌ర్వాల్‌కు పెళ్లి అయ్యి ఒక బిడ్డ‌కు కూడా త‌ల్లి అయ్యింది.  అప్ప‌ట్లో కెరీర్ ప‌రంగా కాజ‌ల్ స్పీడ్‌గా ఉండ‌డంతో ఆమె పెళ్లి జోలికి వెళ్ల‌లేదు. అప్ప‌టి నుంచి కెరీర్ ప‌రంగా ఏదోలా నెట్టు కొచ్చేస్తోన్న కాజ‌ల్ ఇక ఇప్పుడు వ‌య‌స్సు పై బ‌డ‌డంతో పెళ్లి చేసుకోక త‌ప్ప‌ట్లేదు.

 

ఇక ఇటీవ‌ల త‌న‌కు ఎలాంటి భ‌ర్త కావాల‌నే విష‌యంపై ఆమె పెద్ద లిస్టే చెప్పింది. ఇక కాజ‌ల్ ఓ పారిశ్రామిక వేత్త‌ను చాలా డీప్‌గా ల‌వ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా ఆమె అజ్మీర్‌ దర్గాకు వెళ్లి మొక్కులు తీర్చుకుంది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇక స‌ముద్ర తీరంలో ఆమె స్క‌ర్ట్ వేసుకుని సూర్యోద‌యంలో ఫేస్ క‌వ‌ర్ చేస్తూ ఉన్న ఓ ఫొటో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఇదే ఇప్పుడు ఆమె త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేసేందుకు చిహ్న‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

 

కాజల్‌ సముద్ర తీరంలో సంధ్యాసమయంలో రెండు చేతులు పైకి ఎత్తి నిలబడినట్లు ఉంది. ఆమె రెండు చేతి వేళ్ల‌తో ఆర్జిన్ ఆకారం చూపించింది. అంటే దీనిని బ‌ట్టి ఆమె ప్రేమ‌లో ఉంద‌ని సంకేతాలు ఇచ్చింద‌నే ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు పెళ్లి క‌ళ వ‌చ్చేసిందా ?  కాజ‌ల్ అని కూడా ఆమెకు అడ్వాన్స్ శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె పెళ్లే ఇక మిగిలి ఉంద‌ని కూడా కుటుంబ స‌భ్యుల నుంచి సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి కాజ‌ల్ ఏం అంటుందో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: