టీనేజర్లని మాయ చేస్తున్న ఏజ్ లెస్ బ్యూటీ !
వయసు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. సీనియర్లే కాదు.. కుర్రాళ్లు కూడా ఆమే కావాలంటున్నారు. ఆ బ్యూటీతో తెరపంచుకుంటే చాలని కలలు కంటున్నారు. యాభైల్లో ఉన్నా ఆమే మా డ్రీమ్ గర్ల్ అని పాటేసుకుంటున్నారు. మరి టీనేజర్లని కూడా మాయ చేస్తోన్న ఆ బ్యూటీ ఎవరంటారా? ఆమే చాందినీ బార్ కా ఛమేలీ టబు.
టబు వయసు యాభైకి దగ్గరవుతోంది. హీరోయిన్స్ రోల్స్ నుంచి సపోర్టింగ్ రోల్స్ లోకి వెళ్లిపోయి చాలా కాలమవుతోంది. అయినా హీరోలు మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ ని విడిచిపెట్టడం లేదు. ఆమె కరుణిస్తే చాలు పండుగ చేసుకుంటాం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇషాస్ ఖట్టర్ కూడా టబు మాయలో పడిపోయాడు. ఈ బ్యూటీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో మునిగిపోయాడు.
ధడక్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇషాస్ ఖట్టర్ ఇంకా టీనేజ్ లుక్ లోనే ఉన్నాడు. క్యాంపస్ స్టోరీస్ చేసుకునే ఏజ్ నుంచి బయటపడలేదు. అలాంటి కుర్రాడు ఏజ్ తో పనేంటి నేను టబుతో పాటేసుకుంటానని బయల్దేరాడు. ఏ సూటబుల్ బాయ్ అనే టీవీ సిరీస్ లో టబుతో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీలో టబు హైప్రొఫైల్ ప్రాస్టిట్యూట్ గా కనిపిస్తోంది. ఈమె మాయలో పడిన పెద్దింటి కుర్రాడి పాత్ర పోషిస్తున్నాడు.
విక్రమ్ సేథ్ రాసిన ఏ సూటబుల్ బాయ్ అనే నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. నవలా ప్రపంచంలో ఓ సంచలనం సృష్టించిన ఏ సూటబుల్ బాయ్ కథని ఇదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇక పోస్టర్ రావడం ఆలస్యం టబు గ్లామర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. టబుల్ ఏజ్ లెస్ హాటీ అని కామెంట్ చేస్తున్నారు. అందుకే నలభై ఎనిమిదేళ్ల వయసులోనూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది టబు.