అక్కినేని కోడలు సమంత విశేషాలు...

Suma Kallamadi

సమంత ఏప్రిల్ 28వ తేదీ 1987 వ సంవత్సరము లో జన్మించినది. తెలుగు, తమిళ్ భాషల్లో చాలా సినిమాలలో నటించినది. రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు ఉన్న నటి సమంత. భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నది. తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఏం మాయ చేసావో చిత్రంలో మంచి ప్రఖ్యాతి లభించింది. ఆ సినిమాలో నటించేటప్పుడు నాగ చైతన్య గారు సుమంత్ కు ఎన్నో సలహాలు చెప్పేవాడు. 

 

 

తర్వాత వాళ్లు మంచి స్నేహితులుగా మారారు. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా పేరు సంపాదించుకుంది.

 

 

తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించడం జరిగింది. మనం చిత్రము మూడు తరాల వారికి సంబంధించినది గా చిత్రం రూపకల్పన చేయడం అరుదైన విషయం. సమంత, నాగచైతన్యల స్నేహము చివరికి పెళ్లి వరకు తీసుకెళ్ళింద అని అందరికి తెల్సిందే కదా. 

 

 

ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి గోవాలో గోవాలో సాంప్రదాయ బద్ధకంగా పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. సమంత క్రిస్టియన్ అయినందువల్ల చర్చిలో కూడా మరి ఒకసారి వారి వివాహము జరిగినది. సమంత ఇటు నాగార్జున కుటుంబము నకు దగ్గుపాటి వారి కుటుంబమునకు మంచిగా దగ్గర అయినది. సమంత ఏ డ్రస్సు వేసుకున్న చాలా అందంగా ఉంటుంది అని అభిమానుల అభిప్రాయం. ఎంతైనా సమంత ఒక ట్రెండ్ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: