రాజమౌళి హద్దులలో జూనియర్ హద్దులు దాటుతున్న చరణ్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తిరిగి స్పీడ్ అందుకుంది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు వేష ధారణలో ఉన్న రామ్ చరణ్ ను బ్రిటీష్ న్యాయస్థానం ముందు హాజరు పరిచిన సీన్స్ ను రాజమౌళి చాల ఏకాగ్రతతో రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నాడు. ఈషూటింగ్ లో రాజమౌళి చరణ్ కు చిన్న క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు చరణ్ కు అదేవిధంగా జూనియర్ కు తాను పెట్టిన ఒక కండిషన్ చరణ్ కు గుర్తుచేస్తూ ఆకండిషన్ ను తూచా తప్పకుండ జూనియర్ పాటిస్తూ ఉంటే రకరకాల కారణాల వంకతో చరణ్ ఆ కండిషన్ ను బ్రేక్ చేసిన విషయాన్ని రాజమౌళి చిన్నగా చరణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేముందు మీడియాకు అదేవిధంగా ఫంక్షన్స్ కు దూరంగా ఉండమని తాను చరణ్ జూనియర్లకు చెప్పిన విషయాన్ని జక్కన్న ఇప్పుడు మళ్ళీ చరణ్ కు గుర్తుకు చేసినట్లు మాటలు వినిపిస్తున్నాయి.

ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ ప్రారంభం అయిన తరువాత ఒక్క మీడియా ఇంటర్వ్యూ కూడ ఇవ్వలేదనీ చరణ్ మాత్రం ‘సైరా’ వంకతో అనేక మీడియా సమావేశాలలో పాల్గొన్న సందర్భాన్ని రాజమౌళి చరణ్ కు గుర్తుచేసి చురకలు అంటించాడు అని టాక్. అదేవిధంగా సినిమా కథలు వినే విషయంలో భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఆలోచించే విషయంలో జూనియర్ లో ప్రొఫైల్ కొనసాగిస్తుంటే చరణ్ మాత్రం ఎప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాడు అంటూ రాజమౌళి తన
అభిప్రాయాన్ని చరణ్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. 

వాస్తవానికి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ సమయంలో ఈమాటలు నిజంగా చరణ్ తో అన్నాడా లేదా అన్న విషయమై క్లారిటీ లేకపోయినా జరిగిన సంఘటనలు ఇదే అన్నది మాత్రం వాస్తవం. దీనితో చరణ్ తన పద్ధతి మార్చుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయ్యీ వరకు లో ప్రొఫైల్ కొనసాగిస్తాడా లేకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల లోపే జక్కన్న మాటలను లెక్క చేయకుండా కొరటాల చిరంజీవిల మూవీలో మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడా అన్నది రానున్న రోజులలో మాత్రమే తేలే విషయం..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: