పూజా హెగ్డే ఆశలు ఆవరైపోయాయ్.. ఇక ఉన్నదాంతో సరిపెట్టుకోవడమే..!

NAGARJUNA NAKKA

పూజా హెగ్డేకు మరోసారి షాక్ తగిలింది. ఈ సారి కూడా ఈ బ్యూటీ ఆశలు తీరలేదు. సౌత్ కు టాటా చెప్పి నార్త్ లో సెటిల్ కావాలనుకున్న పూజా హెగ్డేకు మళ్లీ గట్టి దెబ్బతగిలింది. టాలీవుడ్ ఇచ్చిన సక్సెస్ లతో బాలీవుడ్ లో ఛాన్స్ లు వస్తున్నా.. ఈ బ్యూటీకి నార్త్ లో కలిసి రావడం లేదు. 


ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే పూజాహెగ్డే అనే చెప్పాలి. వరుసగా పెద్ద స్టార్స్ తో నటిస్తూ తీరక లేకుండా గడిపేస్తోంది. తెలుగులో ఒక్కో సినిమాకు 2కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్డే తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించింది. అయితే టాలీవుడ్ లో సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ నార్త్ బ్యూటీకి బాలీవుడ్ లో మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. 


కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ సినిమాల మీద మోజుతో టాలీవుడ్ కి దూరమైంది. బీటౌన్ లో భారీ బ్రేక్ ఇస్తోందని ఆశలు పెట్టుకొని చేసిన మొహంజదారో డిజాస్టర్ గా మారింది. హృతిక్ రోషన్ తో ఛాన్స్ అనేసరికి తెలుగు ఇండస్ట్రీని లెక్కచేయకుండా ఎగేసుకుపోయింది. తీరా మొహంజదారో ఇచ్చిన షాక్ తో ఈ బ్యూటీకి మళ్లీ టాలీవుడ్ దిక్కైంది. 


పూజా హెగ్డేకు బాలీవుడ్ లో మరోసారి షాక్ తగిలింది. మహర్షి, అరవింద సమేత విజయాలతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటోంది. అయితే ఈ బ్యూటీ ఫోకస్ మాత్రం బాలీవుడ్ మీదే ఉంది. బాలీవుడ్ లో సక్సెస్ పడితే మకాం మార్చేయాలని ప్లాన్ చేస్తోంది. హౌజ్ ఫుల్ 4 అయినా పూజా హెగ్డే కల నెరవేరుస్తుందా అనుకుంటే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అల వైకుంఠపురంలో, ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తోంది. మరి ఇప్పటికైనా నెత్తిన పెట్టుకున్న టాలీవుడ్ కు ప్రాధాన్యత ఇచ్చి బుద్దిగా సినిమాలు చేసుకుంటుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: