నిర్మాతగా కూడా విజయ్ సూపర్ హిట్టే..!

shami
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా చేసిన మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా. షమీర్ సుల్తాన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. ఈరోజు ఆ సినిమా రిలీజైంది. సినిమా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కించారు. 


హీరోగానే కాదు నిర్మాతగా కూడా విజయ్ తన మార్క్ చూపించాడు. మీకు మాత్రమే చెప్తా సినిమా అసలైతే అతను హీరోగా చేయాల్సింది కాని ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ వల్ల తరుణ్ భాస్కర్ తో ఈ సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కాస్త నెగటివ్ టాక్ వచ్చింది.


కంటెంట్ బాగుంది కాబట్టి సినిమాకు మినిమం బడ్జెట్ లోనే తీశాడు విజయ్ దేవరకొండ. అయితే నిర్మాతగా విజయ్ దేవరకొండ మొదటి ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టే లెక్క. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్.. పంచ్ డైలాగ్స్ ఇలా అన్ని సినిమాకు మంచి ఎంటర్టైన్ అందించాయి. ఇక ఈ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి చిన్న బడ్జెట్ లో ప్రతిభ గల వారికి ఛాన్స్ ఇస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.


మీకు మాత్రమే చెప్తా రిలీజ్ ఈవెంట్ లో కూడా కలలు కనండి ఆ కలలని నిజం చేసుకునేందుకు కృషి చేయండనివిజయ్ దేవరకొండ చెప్పాడు. ఇక విజయ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా ఉంటుంది. దాని తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: