నాకు ఆ డైరెక్టర్ అంటే ఇష్టం లేదు అంటున్న కాజల్ అగర్వాల్..!
ఇటువంటి నేపథ్యంలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఒక టాక్ షో లో తెలియజేసింది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ షోలో మాట్లాడుతూ...తన కెరియర్ లో చాలామంది డైరెక్టర్స్ తో పని చేశాను కానీ ఒక్క డైరెక్టర్ తో మాత్రం మళ్లీ పని చేయాలని అనుకోవటం లేదు అంటూ షాకింగ్ విషయం తెలియజేసింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి దీపక్ టిజోరీ. మూడు సంవత్సరాల క్రితం కాజల్ నటించిన హిందీ సినిమా 'దో లఫ్జోంకీ కహానీ'లో హీరోగా రణ్ దీప్ హుడా నటించాడు.
ఆ సినిమాలో రణ్ దీప్ తో కాజల్ ఇంటిమేట్ సీన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమా గురించి కాజల్ అగర్వాల్ చెబుతూ ఒక అందరూ అంధురాలు పాత్రలో..హీరో బెడ్ రూమ్ సన్నివేశాలలో నటించాలి. అటువంటి సీన్స్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్ చెప్పిన విధంగానే చేయటం జరిగింది. దీంతో అటువంటి డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేయకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాను. సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్ లు చాలా మంచివాళ్లు ఇప్పటివరకు ఎవరితో కూడా నాకు మనస్పర్ధలు... ఇబ్బందులు రాలేదని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.