'గబ్బర్ సింగ్'

'గబ్బర్ సింగ్' సినిమా అందించిన గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే ఇమేజ్ కి టర్న్ అయ్యింది కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్. 'బలుపు'తో మరో విజయాన్ని తన జాబితాలో వేసుకున్న ఈ సుందరి. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన 'రేసు గుర్రం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చేస్తున్న తరుణంలోనే హిందీలోనూ 'వెల్ కమ్'కి సీక్వెల్ గా వస్తోన్న 'వెల్ కమ్ బ్యాక్'లో హీరోయిన్ గా నటిస్తోంది శ్రుతి హాసన్.కాగా. తాజాగా శ్రుతి హాసన్ మరో సినిమాకి సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్య హీరోగా మజిల్ తిరుమేని దర్శకత్వంలో 'వడి వాసల్' పేరుతో రూపొందనున్న తమిళ చిత్రానికి శ్రుతి సంతకం చేసిందని. ఈ చిత్రం జనవరిలో లాంఛనంగా ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది విడుదలైన '3' చిత్రం తరువాత తన మాతృభాషలో శ్రుతి చేస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం.మొత్తమ్మీద తెలుగులో ఓ సినిమా. హిందీలో ఓ సినిమా. తమిళంలో ఓ సినిమా అంటూ కమల్ తనయ బాగానే హల్ చల్ చేస్తోందన్నమాట. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తో శ్రుతి జతకట్టిన తెలుగు చిత్రం 'ఎవడు' అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: