దాసరి బుక్ లో చిరంజీవికి అవమానం!

K Prakesh
సంచలన దర్శకుడు దాసరి నారాయణరావు టాలీవుడ్ లో క్రియేట్ చేసిన రికార్డులు మరే దర్శకుడు బ్రేక్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాని పని. 150 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ కు ఎక్కిన ఘనత దాసరిది. ఇటువంటి మహా దర్శకుడి జీవితం పై సీనియర్ సినిమా విమర్శకులు వినాయక్ రావ్ రాసిన ‘విశ్వవిజేత విజయగాధ’ (దాసరి జీవిత చరిత్ర) పుస్తకం వచ్చే నెల 1వ తారీఖున పుస్తకావిష్కరణ జరగబోతోంది. దాసరి జీవితానికి అలాగే దాసరి దర్శకత్వం వహించిన అనేకమంది ప్రముఖ నటీనటుల జీవితాలకు సంబంధించిన చాలామందికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి అని అంటున్నారు. మరొక ట్విస్టు ఏమిటంటే ఈ పుస్తకం కవర్ పేజీపై దాసరి దర్శకత్వం వహించిన టాప్ హీరోలు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు ఫోటోలను పుస్తకం కవర్ పేజీపై ముద్రించిన ఈ గ్రంధ రచయిత దాసరి 100 వ సినిమాలో హీరోగా నటించిన చిరంజీవి ఫోటో ఈ పుస్తకం కవర్ పేజీ పై లేకపోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది.  డిసెంబర్ 1వ తార్ఖున జరగబోతున్న ఈ పుస్తక ఆవిష్కరణ సభకు దాసరి సినిమాలలో నటించిన టాప్ హీరోలు హీరోయినులు అందరూ అతిధులుగా వస్తున్నారని టాక్. అదేవిధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సమావేశానికి ప్రత్యేక అతిధిగా విచ్చేస్తున్నాడట. వీరితో పాటు చిర్మజీవిని కూడా ఈ పుస్తక ఆవిష్కరణ సభకు పిలుస్తారని టాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: