మంచు లక్ష్మి నైట్ డ్రెస్ టార్చర్ ను బయటపెట్టిన నిఖిల్ !

Seetha Sailaja
మోహన్ బాబు కుమార్తెగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మంచు లక్ష్మీ సినిమాలలో పెద్దగా రాణించలేకపోయినా బుల్లితెర కార్యక్రమాలలో తన మార్క్ ను చూపిస్తూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో అనేకమంది సెలెబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచు లక్ష్మి ఆ సెలెబ్రెటీల పడకగది రహస్యాలను బయట పెడుతోంది. 

ఇప్పటికే సమంత వరుణ్ తేజ్ రకుల్ ప్రీత్ లతో అనేక రహస్యాలు బయట పెట్టించిన మంచు లక్ష్మి లేటెస్ట్ గా నిఖిల్ తో కూడ అనేక రహస్యాలు చెప్పేలా చేసింది. ఈ సందర్భంలో నిఖిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి తనను నైట్ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పిందనీ అయితే ఈ విషయంలో ఆమెను బ్రతిమాలి ఆగండం నుంచి తాను బయట పడ్డాను అంటూ జోక్ చేసాడు. 

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ మంచులక్ష్మి మాట అంటే యంగ్ హీరోలు హడలిపోతారని అందువల్ల ఆమె ఏ షో చేసినా వచ్చితీరాలి అంటూ జోక్ చేసాడు. ఇదే షోలో నిఖిల్ ప్రస్తుతం ఒక లేడీ డాక్టర్ తో కొనసాగిస్తున్న ప్రేమ వ్యవహారం బయటపెట్టిన విషయం తెలిసిందే. తారల సీక్రెట్ లు బయట పడుతున్నాయి కాబట్టి ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 

ప్రస్తుతం మంచు లక్ష్మికి ఫిలిం ఇండస్ట్రీలో అందరితోను సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇలాంటి టాక్ షోలు ఏ ఛానల్ అయినా నిర్వహించాలి అంటే ఒక్క మంచు లక్ష్మి మినహా మరెవ్వరు లేకపోవడం బుల్లితెర పై ఆమె ఆధిపత్యాన్ని ఈ విషయంలో నిరూపిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలో కూడ మంచు లక్ష్మి హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: