రాజకీయాలలో మరో నందమూరి హీరో!!

K Prakesh
రాబోతున్న ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణల పాత్ర తెలుగుదేశం పార్టీలో ఎంత వరకు ఉంటుంది అని రోజుకు ఒక ఉహాగానం వస్తున్న నేపధ్యంలో కొత్తగా అదే కుటుంబానికి చెందిన నందమూరి కళ్యాణ్ రామ్ రాబోతున్న ఎన్నికల బరిలో నిలపదతాడు అంటూ వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పై కోపంతో బాలయ్యవచ్చే ఎన్నికలలో నిలబడడు అని వార్తలు వస్తు ఉంటే అసలు జూనియర్ పార్టీ ప్రచారానికే రాకుండా రాబోతున్న ఎన్నికల తేదీలకు జూనియర్ మరో సినిమాను ఒప్పుకుని ఆ సినిమా షూటింగ్ వంకతో ప్రచారానికి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు అని అంటున్నారు.  ఈ వార్తల నేపధ్యంలో కళ్యాణ్ రామ్ పేరు బయటకు వస్తోంది అమెరికాలో ఉన్నత విద్యలు చదువుకుని సినిమా రంగంలోనికి వచ్చిన కళ్యాణ్ రామ్ చూడటానికి అందంగా ఉన్నా సినిమాలలో మటుకు పెద్దగా రాణించలేకపోయాడు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ను రాబోతున్న ఎన్నికలలో పార్టీ తరఫున టికెట్ ఇచ్చి కృష్ణా జిల్లా నుండి పోటీ చేయిస్తే ప్రస్తుతం చంద్రబాబుకు హరికృష్ణ నుండి బాలకృష్ణ నుండి అలాగే జూనియర్ నుండి వస్తున్న తల నొప్పులకు పరిష్కారంగా ఉంటుందనీ అటు చంద్రబాబు ఇటు లోకేష్ కలిసి పదకం రచిస్తున్నారని దీనికి కళ్యాణ్ రామ్ కూడా ఇష్టం చూపించడంతో అతి త్వరలోనే కళ్యాణ్ రామ్ రాజకీయ ప్రవేశం ఖయాం అని అంటున్నాయి తెలుగు దేశం వర్గాలు.  ఈ వార్తలే నిజం అయితే త్వరలోనే రాష్ట్ర రాజకీయాలలో మరో నందమూరి హీరోను చూడబోతున్నాం అనికోవాలి .   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: