‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో చాల మార్పులు చేస్తున్న రాజమౌళి ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ లుక్ మరియు పాత్ర విషయంలో కూడ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన స్వభావం ఇండస్ట్రీ వర్గాలకు లీక్ అయింది.
ఈ మూవీలో చరణ్ జూనియర్ లు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలలో నటిస్తున్న నేపధ్యంలో వీరిద్దరికీ శిక్షణనిచ్చే గురువు పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తాడని సమాచారం. అంతేకాదు రామ్ చరణ్ జూనియర్ లలో స్వాతంత్రోద్యమ స్పూర్తిని రగిలించి వారిని యోధులుగా తీర్చి దిద్దడంలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి అజయ్ దేవగణ్ పాత్ర అత్యంత కీలకం అని అంటున్నారు.
వాస్తవానికి అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలకు చారిత్రక నేపధ్యం ఉన్నప్పటికీ అజయ్ నటిస్తున్న గురువు పాత్ర కేవలం కల్పితంగా ఉంటుందని టాక్. ఈ పాత్ర నిడివి చిన్నది అయినప్పటికీ ఈ సినిమాలో వచ్చే అనేక కీలక సీన్స్ లో అజయ్ పాత్ర ఉంటుందని అంటున్నారు.
ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ కావడంతో రాజమౌళి అనుకోకుండా ‘సైరా’ నటించిన అమితాబ్ పాత్రను స్పూర్తిగా తీసుకున్నాడా లేదంటే యాదృశ్చికంగా ‘సైరా’ లోని అమితాబ్ పాత్ర ‘ఆర్ ఆర్ ఆర్’ లోని అజయ్ దేవగణ్ పాత్ర ఒకేలా సృష్టించ బడ్డాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి గతంలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏ సినిమాను అదేవిధంగా ఏ పాత్రను కాపీ చేయను అనీ కేవలం కొంత వరకు అనుసరిస్తాను అంటూ కాపీ వేరు అనుసరణ వేరు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో రాజమౌళి లాంటి టాప్ దర్శకుడు సురేంద్ర రెడ్డి లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ను అనుసరిస్తున్నాడా అంటూ కొందరు షాక్ అవుతున్నారు..