సుడిగాలి సుధీర్ లవ్ ఫెయిల్.. రష్మితో రిలేషన్ అలాంటిదే..!

shami
బుల్లితెర మీద క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న సుధీర్, రష్మిల యాంకరింగ్ అదిరిపోతుంది. జబర్దస్త్ లో రష్మి యాంకర్ కాగా సుధీర్ కమెడియన్ గా ఉన్నాడు. కాని వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యే సరికి ఢీ షోలో రష్మి, సుధీర్ లను టీం లీడర్స్ గా ప్రమోట్ చేశారు. ఆ షోలో వారిద్దరు చేసే హంగామా మాములుగా ఉండదు.


వరుసగా రెండు సీజన్లు ఢీకి సుధీర్, రష్మిలు ఇద్దరు టీం లీడర్స్ గా చేశారు. ఆ షోలో కూడా ఇద్దరి క్లోజ్ నెస్ బాగా పెరిగింది. వారిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసి ఆఫ్ స్క్రీన్ లో కూడా సుధీర్, రష్మిల మధ్య ఏదో జరుగుతుందన్న టాక్ వచ్చింది. సుధీర్, రష్మి ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తున్నా సరే వాటికి ఫుల్ స్టాప్ పడలేదు.


ఇక లేటెస్ట్గా సుధీర్ స్వయంగా తనకు రష్మికి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని. కేవలం షో కోసమే తనని ప్రేమిస్తున్నట్టుగా.. తన వెంట పడుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. డైరక్టర్ ఏం చెబితే అది చేస్తాను తప్ప తను వేరే ఏం చేయనని అన్నాడు. బయట తను అసలు అమ్మాయిలతో మాట్లాడను కాని షోల ద్వారా కామెడీగా తనని అమ్మాయిల పిచ్చోడిగా చూపిస్తారు. అది చూసి తనకు పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు.


రష్మితో తనకు ఎలాంటి రిలేషన్ లేదు.. ఇక మీద ఉండదని తేల్చేసిన సుధీర్ తను ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అని అందుకే ఇక మీదట ప్రేమ జోలికి పోదలచుకోలేదని అన్నాడు సుధీర్. సుధీర్, రష్మి ఎంత మామధ్య ఏం లేదని చెప్పినా వారు స్మాల్ స్క్రీన్ పై చేసే ఓవరాక్షన్ కు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు కనెక్ట్ అవుతారన్న టాక్ వస్తుంది. ఆడియెన్స్ కూడా ఆ ఉద్దేశంతోనే వారు కనిపించిన ప్రతిసారి ఇదే విషయాన్ని ప్రస్థావిస్తారు. మరి నిజంగానే సుధీర్, రష్మిల మధ్య ఏం లేదని తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లాడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: