వేణుమాధవ్ కు నేను డబ్బు బాకీ ఉన్నాను : కోట శ్రీనివాసరావు ఎమోషనల్ వీడియో....!!

Mari Sithara
ప్రముఖ హాస్య నటుడు venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ నిన్న మధ్యాహ్నం కిడ్నీల వ్యాధితో అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ పరిస్థితి మరింత క్షీణించడంతో, రెండు రోజుల క్రితం ఆయనను సికింద్రాబద్ లోని యశోద హాస్పిటల్ లో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు. అయితే వైద్యులు ఎంత మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆయన శరీరం మాత్రం సహకరించక, చివరికి నిన్న మధ్యాహ్నం ఆయన కన్నుమూయడం జరిగింది. venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ మృతితో టాలీవుడ్ చిత్ర సీమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక నేటి మధ్యాహ్నం ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచిన అనంతరం కాసేపటి క్రితం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. 

పలువురు సినిమా ప్రముఖులు మరియు అభిమానులు ఆయనను కడసారి చూడడానికి విపరీతంగా అక్కడకు తరలివచ్చారు. ఇకపోతే venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ గురించి సీనియర్ నటుడు కోటశ్రీనివాస రావు నేడు మీడియాతో మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కామెడియన్లకు ఏదో దిష్టి తగిలింది, ఇప్పటికే ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్లిపోయారు, ఇక ఇప్పుడు వయసులో ఎంతో చిన్నవాడైన venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ మనల్ని వదిలి వెళ్లడం నిజంగా ఎంతో కలిచివేస్తోందని ఆయన అన్నారు. venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ ఎక్కడ ఉంటె అక్కడ ఆ ప్రాంతం అంతా ఎంతో సందడి సందడిగా ఉంటుందని, తనతో కలిసి అనేక సినిమాల్లో పని చేసినపుడు తనను ఆప్యాయంగా బాబాయి అని నన్ను పిలిచేవాడని కోట గుర్తుచేసుకున్నారు. 

ఇక కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్తున్న సమయంలో ఒక ఎయిర్పోర్ట్ లో ఒక వస్తువు కొనుక్కోవడానికి తనవద్ద డబ్బు తక్కువ అయిందని, అప్పుడు ప్రక్కనే ఉన్న venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణును అడగగానే రెండువేల రూపాయలు వెంటనే తీసి ఇచ్చాడని అన్నారు. అయితే ఆ తరువాత ఎన్నో సార్లు ఆ డబ్బును తనకు తిరిగి ఇద్దామని ఎన్ని సార్లు ప్రయత్నించిన వేణు తీసుకునేవాడు కాదని, ఒక గొప్ప మహానటుడు నాకు బాకీ ఉన్నాడు అని నేను ఎలా చెప్పుకుంటానని, కాబట్టి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అని venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN">వేణుమాధవ్ అన్నట్లు చెప్పారు కోట శ్రీనివాసరావు. అంత గొప్ప మనసు గల అతడి ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు చెప్పారు కోట.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: