అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన రవిబాబు ఆ తరువాత వరసగా సినిమాలు చేశారు. అల్లరి సినిమా సూపర్ హిట్ అయ్యింది. రవిబాబు సినిమాలంటే డిఫరెంట్ గా ఉంటాయనే నానుడి ఉన్నది. దీంతో రవిబాబు వరసగా సినిమాలు చేశారు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ కొట్టాడు. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, అనసూయ, నచ్చావులే, అమరావతి, మనసారా, అవును సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు.. వరసగా ప్లాప్ అవుతూ వచ్చాయి అయన సినిమాలు. ఒకటికాదు రెండు కాదు వరసగాపెట్టి సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో రవిబాబు పని సమాప్తం అనుకున్నారు. కానీ, రవిబాబు మాత్రం సినిమాలు చేయడం మానలేదు. ఇటీవలే ఓ మంచి కథతో దిల్ రాజు దగ్గరకు వెళ్లారు. ఎప్పుడు వెరైటీగా కథలు చెప్పే రవిబాబు ఈసారి కూడా అదే వెరైటీని ఎంచుకున్నాడు.
ఆవిరి పేరుతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. థ్రిల్లింగ్ స్టోరీ కావడంతో రాజుబు బాగా నచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా ప్రారంభమ అయ్యింది. తక్కువపెట్టుబడి. సినిమా హిట్టైంది అంటే.. మంచి లాభాలు వస్తాయి. అందులో సందేహం అవసరం లేదు. అందుకే దిల్ రాజు ఒకే చెప్పడంతో ప్రాజెక్ట్ ముందుకునడిచింది . ఆవిరి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. గ్యాస్ స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్.. అందులో ఓ తల.. కుక్కర్ పై మూత కొద్దిగా పైకి ఎత్తి ఉంటుంది. రెండు కళ్ళు బయటపెట్టి చూస్తున్నట్టుగా ఉన్నది ఫోటో.
చూస్తుంటే అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలానే కనిపిస్తోంది. దిల్ రాజును మెప్పించి సినిమా చేస్తున్నాడు అంటే కథలో విషయం ఉండే ఉంటుంది. లేకుండా సినిమా కథను దిల్ రాజు ఒప్పుకోడు. కాబట్టి సినిమా ఎలా ఉంటుంది అనే విషయం త్వరలోనే తేలిపోతుంది. ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వైధ్య్ సంగీతం సమకూరుస్తున్నారు.