రెబల్ స్టార్ సాహో సినిమా మరొక మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపుగా రూ.350 కోట్ల ఖర్చుతో ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించడం జరిగింది. ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సంచలనం సృష్టించాయి. ఇకపోతే తొలిసారి ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హిందీలో కూడా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు ప్రశంశలు కురిపించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కథ మరియు కథనాలు ఇవేనంటూ గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఈ సినిమా విషయమై మరొక వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, మొదటి నుండి చివరి వరకు మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగె ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఉన్నాయని, అయితే అందులో ఒక సీన్, టోటల్ సినిమాకే హైలైట్ అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలో ప్రీ క్లైమాక్స్ గా దాదాపు ఒక అరగంట పాటు వచ్చే యాక్షన్ మరియు ఛేజింగ్ సన్నివేశాలు సినిమా మొత్తానికి అతి పెద్ద హైలైట్ గా ఉండనున్నాయనేది ఆ వార్త యొక్క పూర్తి సారాంశం.
అంతేకాక సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్టులతో పాటుగా, సినిమా క్లైమాక్స్ లో ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేసే ఒక ఊహించని ట్విస్ట్ ఉందని కూడా అంటున్నారు. అయితే కొద్దిరోజలుగా ప్రచారం అవుతున్న వార్తల మాదిరి ఇది కూడా ఒక పుకారేనంటూ దీనిని కొందరు సినీ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరొక్క మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే....!!