ఆ సినిమా ఎందుకు డిజాస్టర్ అయ్యిందో సీక్రెట్ చెప్పిన పవన్ ?

Chakravarthi Kalyan

స్వీయ లోపంబెరుగుట పెద్ద విద్య.. అన్నాడు గాలీబ్ కవి.. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నాడు వేమన. అవును ఎదుటి వాడు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెదకగల మహానుభావులు మనలో చాలా మందే ఉన్నారు. కానీ తాము చేసిన పనిలో తప్పులు చెప్పమంటే మాత్రం నీళ్లు నములుతారు.


ఎందుకంటే మనకు ఆత్మవిమర్శ తక్కువ. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం తన ఫెయిల్యూర్స్ ను నిక్కచ్చిగానే అంచనా వేసుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ కెరీర్ మొదట్లో తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత జానీ సినిమా తీశాడు. ఆ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఉన్నాయి.


కానీ చివరకు సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో ఆ రహస్యాన్ని పవన్ కల్యాణ్ ఓ కార్యక్రమంలో బయటపెట్టారు. జానీ సినిమా ఎందుకు ఆడలేదో అందరి కంటే కూడా నాకే బాగా తెలుసన్నారు పవన్ కల్యాణ్.. కమర్షియల్ యాంగిల్ లో పడి అనుకున్న కథను సరిగ్గా తెరకెక్కించలేకపోయాడట. అందువల్లే ఆ సినిమా ఘోరంగా ఫెయిలైందట.


కమర్షియల్ సినిమాలతో పాటు చాలా విలువలు ఉన్న సినిమాలు కూడా ముందు ముందు చాలా రావాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. తన సినిమాల్లో ఎన్నో కమర్షియల్ హంగులు ఉన్నా సమాజానికి ఉపయోగపడే మంచిని చెప్పడానికి తన వంతు ప్రయత్నం చేశాడట పవర్ స్టార్. అంతేకాదు.. మంచి సినిమాలు ఎవరు చేసినా ప్రేమించేవాడిని, ఆహ్వానించేవాడిని అంటూ గతం గుర్తు చేసుకుంటున్నారు. సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో.. నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయన్నది పవన్ కల్యాణ్ ఒపీనియన్. అయితే ఇక సినిమాలు తీయనంటున్న పవన్ నిర్ణయం మాత్రం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: