మహానటి సావిత్రి నిజ జీవితంలో పొందలేని అదృష్టాన్ని అందుకున్న కీర్తి సురేష్ !

Seetha Sailaja
నిన్నప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘మహానటి’ సినిమాలో నటించినందుకు కీర్తి సురేష్ కు ఉత్తమనటి అవార్డ్ రావడం ఆమె కీర్తి పతాకానికి ఒక గుర్తింపుగా చాలామంది భావిస్తున్నా ‘మహానటి’ సావిత్రి జీవితంలో అందుకోలేని గౌరవాలను కీర్తి సురేశ్ అందుకోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. సావిత్రి చనిపోయి దరిదాపు 36 సంవత్సరాలు గడిచిపోతున్నా తెలుగు ప్రజల హృదయాలలో ఇప్పటికీ సావిత్రి జీవించి ఉంది. 

కొన్ని వందల సినిమాలలో అనేక క్లిష్టమైన పాత్రలు పోషించిన సావిత్రికి నటిగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి కానీ ఆమెకు జాతీయ ఉత్తమనటి పురస్కారం ఎప్పుడు లభించలేదు. అంతేకాదు ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లతో సమానంగా ఇండస్ట్రీని శాసించిన సావిత్రికి పద్మశ్రీ పురస్కారం కూడ ఆమె జీవించి ఉన్నరోజులలో రాలేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని ఏ యూనివర్సిటీ కూడ కనీసం సావిత్రికి గౌరవ డాక్టరేట్ కూడ ఇవ్వలేదు. 

అయితే సావిత్రి మటుకు ‘మహానటి’ గా తెలుగు ప్రజల హృదయాలలో ఇంకా జీవించే ఉంది. దీనితో సావిత్రి అందుకోలేని గొప్ప గౌరవం ఆమె పాత్ర పోషించిన కీర్తి సురేశ్ కు రావడం యాధృశ్చికం అనుకోవాలి. ‘మహానటి సినిమా విడుదల అయ్యేవరకు సావిత్రి పాత్ర కీర్తి సురేశ్ కు దక్కడం ‘వరమా లేక శాపమా’ అంటూ అనేకమంది విశ్లేషణలు చేసారు. అయితే ఆవిమర్శకులకు సమాధానంగా కీర్తి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆమె జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఫోటోలు అన్నీ పూర్తిగా పరిశీలించడమే కాకుండా ఆసినిమాలో కీర్తి సావిత్రి పాత్రలో నటించే సమయంలో తన రూమ్ లో అన్నీ సావిత్రి ఫోటోలతో నింపుకుంది అంటే ఈ పాత్ర కోసం కీర్తి ఎంత హోమ్ వర్క్ చేసిందో అర్ధం అవుతుంది. 

ఈసినిమాలో చివరి దశలో సావిత్రి తాగుడుకు బానిస అయిపోయినప్పుడు సావిత్రిలా బుగ్గలు రావడం కోసం నోట్లో దూది పెట్టుకోవడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన డైలాగ్స్ అన్నీ నోట్లో దూది పెట్టుకుని తాను డైలాగ్స్ చెప్పిన విషయాన్ని కీర్తి గుర్తుకు చేసుకుంది. ‘మహానటి’ మూవీలో కీర్తి నటనకు ఉత్తమనటి అవార్డ్ వచ్చినా ఆ అవార్డు సావిత్రి పాత్రకోసం కీర్తి పడిన కష్టానికి తగిన గుర్తింపు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: