ఇస్మార్ట్ దెబ్బకు చతికిలబడ్డ కామ్రేడ్....??

Mari Sithara
ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాలతో విడుదలైన రెండు క్రేజీ మూవీస్ పై గత కొద్దిరోజలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కొద్దిపాటి యుద్ధం నడుస్తోంది. ఆ రెండు సినిమాల్లో నటించిన ఆయా హీరోల అభిమానులు, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గత కొద్దిరోజులుగా ఒకరిపై మరొకరు మీడియా వేదికల్లో కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇక ఆ రెండు సినిమాలు ఏవంటే ఒకటి ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ అయితే, మరొకటి యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్. వాస్తవానికి తొలి రోజు సూపర్ టాక్ తో మొదలైన ఈ సినిమాలు కూడా ప్రేక్షకుల మదిని తాకాయి. 

అయితే వాటిలో ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ ఎక్కువగా దూసుకుపోతుంటే, డియర్ కామ్రేడ్ మాత్రం కాస్త మెల్లగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు ఈ రెండు సినిమాల విషయమై ట్రేడ్ విశ్లేషకులు, వాటికి ఇప్పటివరకు వసూలైన కలెక్షన్ లెక్కల ప్రకారం ఏ సినిమా ఏ రేంజిలో దూసుకుపోతోందో తేల్చి చెప్పారు. ఇక వారు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే, రామ్ నటించిన ఇస్మార్ట్, ఇప్పటికే రూ.75 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసి, ఇంకా కొన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోందని, మరీ ముఖ్యంగా ఏ సెంటర్లతో పోలిస్తే బీ,సి సెంటర్ల ప్రేక్షకులు, ఈ సినిమాను ఇంకా ఆదరిస్తూనే ఉన్నారని అంటున్నారు. అయితే విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా మొన్నటివరకు బి, సి సెంటర్ల కంటే ఏ సెంటర్స్ లో మంచి కలెక్షన్ రాబట్టడం జరిగిందని, కానీ నిన్న రాక్షసుడు, గుణ 369 సినిమాలు విడుదలై ఆ సినిమాకు ఏ సెంటర్స్ లో వచ్చే కలెక్షన్స్ కు కొంత గండి కొట్టాయని చెప్తున్నారు. 

ఇక రెండు రోజుల నుండి డియర్ కామ్రేడ్ కు చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, ఇప్పటివరకు ఈ సినిమా రూ.39 కోట్ల గ్రాస్ కలెక్షన్ మాత్రమే సాదించగలిగిందని, ఈ పరిస్థితి చూస్తుంటే మరిన్ని కొద్దిరోజుల్లోనే ఈ సినిమా పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయని వారు చెప్తున్నారు. అయితే నిన్న విడుదలైన రెండు సినిమాల ప్రభావం ఇస్మార్ట్ పై పెద్దగా లేదని కూడా వారు అంటున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు మరింతగా ఏ సెంటర్స్ ప్రేక్షకులను రంజింప చేస్తోందని, ఇక మొత్తంగా దీన్నిబట్టి చూస్తే మొన్నటి ఈ రెండు సినిమాల రేస్ లో ఇస్మార్ట్ శంకర్ చాలావరకు ముందున్నప్పటికీ మరికొద్దిరోజలు గడిచాకగాని రెండిట్లో క్లియర్ విన్నర్ ఎవరు అనేది చెప్పలేమని వారు అంటున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: