తెలుగు బిగ్ బాస్ 3 కావాల్సినన్ని వివాదాలతో వీక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతోంది. ఈ షో ప్రారంభానికి ముందు నుంచే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా ఉండడంతో చాలామంది నాగార్జునను కూడా టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తొలుత తాను బిగ్బాస్కు ఎంపికైనట్టు చెప్పి... తర్వాత తనను ఎలిమినేట్ చేశారని వాపోతున్న శ్వేతారెడ్డి బిగ్ బాస్ ను టార్గెట్ గా చేసుకుని కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్వేతారెడ్డి సోమాజిగూడ ప్రెస్కబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి నాగార్జున పై చాలా ఘోరమైన వ్యాఖ్యలు విరుచుకుపడ్డారు.
సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించిన శ్వేత డబ్బుల కోసం నాగార్జున తన భార్య అమలు, తన కోడలు సమంతను బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతారా ? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలతో విమర్శించారు. అక్కడితో ఆగకుండా నాగార్జున ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేని మాటలతో కూడా ఆయన్ను నిందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. నాగార్జున ఈ విషయంపై స్పందించకుంటే బిగ్ బాస్ హౌస్ ముట్టడిస్తామని కూడా శ్వేత హెచ్చరించారు. డబ్బుల కోసం నాగార్జున ఏమైనా చేస్తారా ? అని ప్రశ్నించిన ఆమె ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారుగా అని కౌంటర్ వేయడం గమనార్హం.
బిగ్ బాస్ హౌస్ 3లో ఎలాంటి అశ్లీలత లేకుంటే షో నుంచి బయటకు వచ్చి నాగార్జున ఎందుకు మీడియా మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. ఏదేమైనా బిగ్ బాస్ 3 షోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెతో పాటు ఓయూ జేఏసీ నేతలు కూడా మీట్లో పాల్గొన్నారు. ఈ షో రద్దు చేయకపోతే తాము అన్నపూర్ణ స్టూడియో లోపల బిగ్ బాస్ 3 జరుగుతున్న ప్రాంతాన్ని తాము ముట్టడిస్తామన్నారు. రియాల్టీ షోలో మహిళల్ని అసభ్యంగా చూపిస్తే ఊరుకునేది లేదన్నారు.
అక్కడితో ఆగని వారు త్వరలో విడుదల కాబోతున్న నాగార్జున మన్మథుడు 2 సినిమాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. మన్మధుడు 2 సినిమా విడుదలను రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. రియాల్టీ షోల వల్ల డబ్బులే కావాలనుకున్నప్పుడు వాటికి బదులుగా అశ్లీల చిత్రాలు తీసుకోవచ్చు కదా ? అని చురకలు అంటించారు. మరి దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో ? చూడాలి.