'ఆర్ఎక్స్ 100' ఛాయలే ఎక్కువ.. మరి హిట్ వస్తోందా ?
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'గుణ 369'. కాగా ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ లో మలబారు బ్యూటీ అనఘ కార్తికేయతో రొమాన్స్ చేయబోతుంది. అయితే గత ఏడాది విడుదలైన 'ఆర్ఎక్స్ 100' చిత్రం అంత పెద్ద హిట్టవడానికి ప్రధాన కారణం అందులోని వాస్తవ కథే. ఈ ఫార్ములాను గట్టిగా నమ్మిన హీరో కార్తికేయ ఈ సినిమా రూపంలో మళ్ళీ దాన్నే ఫాలోఅవుతున్నారట. అర్జున్ జంధ్యాల చెప్పిన ఈ రియల్ లైఫ్ స్టోరీలో 'ఆర్ఎక్స్ 100' ఛాయలు కనబడేసరికి నమ్మకముంచి 'గుణ 369'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అప్పట్లో కార్తికేయ చెప్పాడు. మరి 'ఆర్ఎక్స్ 100' ఛాయలు మరీ ఎక్కువైతే.. గుణ కూడా మరో హిప్పీ అవుతుంది.
సినిమా అయితే ఎమోషనల్ గా చాల బాగుంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త కాన్సెప్ట్స్ పై ఆసక్తి చూపే ప్రేక్షకులకు మా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ మూవీలో కాన్సెప్ట్ నే మెయిన్ అని.. అలాగే కాన్సెప్ట్ తో పాటు విజువల్స్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. అన్నిటికి మించి సినిమాలో ఎమోషన్ తో పాటు విలువైన మెసేజ్ కూడా ఉందట. మొత్తంగా మనల్ని ఈ సినిమా ఎమోషనల్ గా టచ్ చేస్తోందని.. అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది చిత్రబృందం. ఐతే ఈ సినిమాలో హీరో కార్తికేయ 90ల నాటి పక్కా పల్లెటూరి దొరబాబులా ఉంటాడట. గత చిత్రం 'హిప్పీ'లో అల్ట్రా మోడరన్ గెట్ అప్స్ లో బోల్డ్ గా కనిపించాడు కార్తికేయ.
ఇక ఈ మూవీలో కార్తికేయ సరసన నటించిన అనఘా ఈ సినిమాలో అద్భుతంగా నటించదట. ఇక ఈ సినిమాలో సాయి కుమార్, ఆదిత్య మీనన్, మంజు భార్గవి, జబర్దస్త్ మహేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై తిరుమలరెడ్డి,అనిల్ కడియాల నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కార్తికేయకి హిట్ వస్తుందేమో చూడాలి.