‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స్పాట్ లో మినరల్ వాటర్ విషయంలో మహేష్ కు తేడా జరిగింది అంటూ నిన్న అనేక ప్రముఖ పత్రికలలో కూడ వార్తలు రావడంతో ఈవిషయం గురించి తెలుసుకుందామని కొందరు ఇండస్ట్రీ వర్గాల ప్రముఖులు దిల్ రాజ్ ను సంప్రదిస్తే కొన్ని షాకింగ్ విషయాలు చెప్పినట్లు టాక్. వాస్తవానికి మీడియాలో వచ్చిన ఈ మినరల్ వాటర్ బాటిల్స్ వ్యవహారం మహేష్ కు సంబంధించింది కాదనీ ఈమూవీ యూనిట్ లోని చిన్న ఆర్టిస్టులకు సంబంధించిన విషయం ఆని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే మీడియాలో వచ్చిన ఈ మినరల్ వాటర్ మోసానికి సంబంధించిన వార్తలు విని మహేష్ తీవ్ర అసహనానికి లోనైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో పనిచేస్తున్న అందరికీ తనతో సమానంగా మంచి కంపెనీ మినరల్ వాటర్ బాటిల్స్ ఇవ్వడమే కాకుండా అందరికీ ఫుడ్ విషయంలో కూడ ఎటువంటి తేడాలు చూపించ వద్దని మహేష్ ఈమూవీ యూనిట్ వర్గాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించిన అసలు వాస్తవాలు బయటకు లీక్ అవ్వడంతో కొందరు ఇండస్ట్రీ వర్గ ప్రముఖులు మహేష్ ఉదారతను మెచ్చుకుంటూనే ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ పై జోక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి నాన్ ధియేటర్ రైట్స్ కింద 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్న మహేష్ ఇలా తన ఉదారతను చూపెడుతూ ఈమూవీ ఖర్చులను మరింత పెంచితే అసలు దిల్ రాజ్ కు ఈమూవీ తీసినందు వల్ల ఒక రూపాయి అయినా మిగులుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నట్లు టాక్.
ఇప్పుడు ఈ జోక్స్ దిల్ రాజ్ వరకు చేరడంతో దిల్ రాజ్ అసహనానికి గురైనట్లు గాసిప్పులు వస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పెరిగి పోతున్న బడ్జెట్ విషయంలో టెన్షన్ పడుతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి మహేష్ ఉదారత కూడ పెరిగి పోవడంతో ఇక భవిష్యత్ లో నిజంగానే టాప్ హీరోల సినిమాలు అంటే దిల్ రాజ్ భయపడే పరిస్థితి వస్తుంది..