రణభీర్ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు..నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌కపూర్ మనవడు, రిషికపూర్ నీతూసింగ్ ల గారాలకొడుకు...మంచినటుడు..అంతకన్నా మంచి వ్యక్తిత్వం రణభీర్ కపూర్ సొంతం.. అయితే ఇవన్నీ ఉన్నా కత్రినాకైఫ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఏమైందో బ్రేక్ చెప్పాడు.. ఆ తరువాత ఆలియాభట్ తో డేటింగ్ లో ఉన్నాడు..తండ్రి రిషికపూర్ అప్పటి ప్రముఖ హీరోయిన్ నీతూసింగ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. అదే వారసత్వాన్ని కొనసాగింపుకు ప్రయత్నం చేస్తున్నాడు రణభీర్ కపూర్..
ప్రఖ్యాత దర్శకుడు మహేష్ భట్ కూతురు ఆలియా భట్. మహేష్ భట్ తెలుగులో ఒకేఒక్క సినిమా నాగార్జున హీరోగా క్రిమినల్ సినిమా డైరక్టు చేసారు... తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో .. పాప్యులర్ పొందిన ఈ పాట క్రిమినల్ సినిమాలోనిదే..
కత్రినాకైఫ్ టాప్ హీరోయిన్.. ఆలియాభట్ మంచినటిగా పేరు తెచ్చుకున్నది.. ఇద్దరూ మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నవి..
ఆలియాభట్, రణభీర్ కపూర్ ల ప్రేమ త్వరలో పెళ్ళిపీటలు వరకూ వెళ్ళనుందని బాలీవుడ్ టాక్....ఇంత జరిగినా కత్రినా..ఆలియాల మధ్య స్నేహం అలానే ఉండడం కొసమెరుపు .....