ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
కానీ డీగ్రేడ్ అంటూ జనాలు తిరస్కరించారు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న హెబ్బా పటేల్ తాజాగా నితిన్ నటిస్తున్న భీష్మ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. భీష్మ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్నది. అయితే ప్రస్తుతం నితిన్ - హెబ్బా జంటపై కీలక సన్నివేశాల చిత్రీకరణకు టీమ్ రెడీ అవుతోంది. ఇదో రొమాంటిక్ డ్రామా.
ఇందులో హెబ్బాతో కాస్తంత ఘాటైన రొమాన్స్ ఉంటుందట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.