విజయనిర్మల జయసుధ కి మధ్య ఉన్న రిలేషన్ ఎవరికైనా తెలుసా…!
అతి చిన్న వయసులోనే అనగా ఏళ్ల వయసులోనే భరత నాట్యం నేర్చుకున్నారు. ఆ వయసులోనే తమిళ చిత్రం ద్వారా సినిమా ఎంట్రీ ఇచ్చారు. 11 సంవత్సరాల వయసులో పాండురంగ మహత్యం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హీరోయిన్ గా మాత్రం రంగులరాట్నం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మూడు భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు.
2002లో గిన్నీస్ బుక్లో ఆమెచోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు.అయితే విజయనిర్మలకు, నటి జయసుధకి ఉన్న రిలేషన్ గురించి చాలా మందికి తెలియదు. జయసుధకి విజయనిర్మల పిన్ని అవుతారు. ఆ కారణంగానే విజయనిర్మల ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్స్ లో జయసుధ కనిపిస్తుంటారు. దీంతో విజయనిర్మల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు పెద్దలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.