నా కోసం ప్రార్థించండి అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమీరా రెడ్డి సూర్యతో కలిసి నటించిన రొమాంటిక్ సీన్లు ఇప్పటికి కూడా ప్రేక్షకులను రక్తి కట్టిస్తాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసిన పెద్దగా మెప్పించలేకపోయింది. కొన్నాళ్లకు తెలుగు తమిళంలో కూడా సినిమాలు చేసిన బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది.
అయితే ఇప్పుడు సమీరారెడ్డి తల్లి కావడంతో త్వరలో డెలివరీ కాబోతున్న నేపథ్యంలో తన కోసం ప్రార్థించండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులను కోరుకుంది. డెలివరీ డేట్ దగ్గర పడటంతో ప్రసవం సులువుగా అయ్యి తల్లి పిల్ల ఇంటికి ఆరోగ్యంగా రావాలని దేవుడిని కోరుకోమని అభిమానులకు సమీరా రెడ్డి తెలియజేసింది.