సొట్ట బుగ్గల తాప్సి నటించిన గేమ్ ఓవర్ సినిమా జూన్ 14 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. వీల్ చైర్ లో కూర్చొని నటించే యువతిగా తాప్సి కనిపిస్తోంది. కాళ్లకున్న కట్టుకు.. ఆమె గేమ్ కు ఉన్న సంబందం ఏంటి .. గేమ్ ఓవర్ అంటే అర్ధం ఏంటి అనే విషయాలను చాలా క్యూరియాసిటీతో సినిమాలో చూపించబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పేర్కొన్నారు. తెలుగు సినిమాలు చేస్తున్న సమయంలో బాలీవుడ్ నుంచి అఫర్ రావడంతో అటు వెళ్లినట్టు చెప్పింది. అక్కడ అవకాశాలు తక్కువగా వస్తున్నా.. మంచి సినిమాలు వస్తున్నాయని.. కాకపోతే గ్లామర్ కు పెద్దగా అవకాశం లేకుండా ఉండే సినిమాలు వస్తున్నట్టు చెప్పింది.
తాను మిగతా హీరోయిన్ల మాదిరిగా స్కిన్ షో, లిప్ లాక్ లకు సిద్ధంగా ఉన్నా అని చెప్పినా అలాంటి సినిమాల్లో అవకాశాలు రావడం లేదని మీడియాకు తెలిపింది. బాలీవుడ్ సినిమాలకు గ్యాప్ వచ్చిన సమయంలో సౌత్ సినిమాలు చెయ్యొచ్చని కాకపొతే డిఫరెంట్ భాషల్లో సినిమాలు చేసే సమయంలో డేట్స్ ఇబ్బంది కలగడం వలన ఎక్కువ చేయలేకపోయినట్టు తాప్సి తెలిపింది.
అంతేకాదు, ఇప్పటికే సినిమా రంగంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. తాప్సి ఎప్పుడు వివాహం చేసుకోబోతుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు ఎప్పుడు పిల్లలు కావాలి అనిపిస్తే అప్పుడు వివాహం చేసుకుంటానని చెప్పింది. అప్పటి వరకు సినిమాలు చేస్తానని చెప్పడం విశేషం.